- Telugu News Photo Gallery Technology photos Samsung launching new smart phone galaxy f55 5g features and price details
Galaxy f55: సామ్‌సంగ్ నుంచి మిడ్ రేంజ్ ఫోన్.. వావ్ అనిపించే ఫీచర్స్
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్‌సంగ్ ఇటీవల మిడ్ రేంజ్ బడ్జెట్ ఫోన్‌లను తీసుకొస్తూ మెజారిటీ మార్కెట్‌ను సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా మార్కెట్లోకి మరో ఇంట్రెస్టింగ్ ఫోన్‌ను తీసుకొస్తోంది. సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎఫ్55 పేరుతో కొత్త 5జీ ఫోన్‌ను లాంచ్ చేయనుంది. ఇంతకీ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: May 12, 2024 | 7:12 PM

దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్‌సంగ్ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. గ్యాలక్సీ ఎఫ్55 పేరుతో ఈ ఫోన్‌ను లాంచ్ చేయనున్నారు. ఈనెల 17వ తేదీన ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. గత నెలలో ఈ ఫోన్ చైనాలో లాంచ్ కాగా తాజాగా భారత మార్కెట్లోకి రానుంది.

ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 ఎస్వోసీ చిప్ సెట్ ప్రాసెసర్‌ను అందించారు. గెలాక్సీ ఎఫ్55 5జీ ఫోన్ సేల్స్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌తో సామ్‌సంగ్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండనున్నాయి.

ధర విషయానికొస్తే 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 26,999కాగా, 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 32,999గా నిర్ణయించారు. ఈ ఫోన్‌ను అప్రికోట్ క్రష్, రైజిన్ బ్లాక్ కలర్స్‌లో అందుబాటులోకి తెచ్చారు.

ఇక ఇందులో 6.7 ఇంచెస్‌తో కూడిన సూపర్ అమో ఎల్‌ఈడీ ఫుల్‌హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 1080×2400 పిక్సెల్ రిజొల్యూషన్ ఈ స్క్రీన్ సొంతం. 100 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కావడంతో సన్‌లైట్‌లోనూ స్క్రీన్ క్లారిటీగా చూడొచ్చు.

కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన ప్రైమరీ సెన్సర్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్‌ను ఇచ్చారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50 ఎంపీ ఫ్రంట్ కెమెరాను అందించారు. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 45 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ కెపాసిటీ బ్యాటరీని అందించారు.




