- Telugu News Photo Gallery Technology photos Samsung launching new foldable smartphone Samsung Z Fold 6 features and price details
Samsung Z Fold 6: సామ్‌సంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేస్తోంది.. లీకైన ఫీచర్స్.
ప్రస్తుతం ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్స్ హవా కొనసాగుతోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న దిగ్గజ స్మార్ట్ ఫోన్ కంపెనీలన్నీ కొంగొత్త ఫోల్డబుల్ ఫోన్‌లను తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్‌సంగ్ మార్కెట్లోకి కొత్త ఫోల్డబుల్ ఫోన్‌ను తీసుకొస్తోంది. సామ్‌సంగ్ జెడ్ ఫోల్డ్ 6 పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొస్తున్నారు. ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Jun 07, 2024 | 10:10 PM

సౌత్ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్‌సంగ్ మార్కెట్లోకి కొత్త ఫోల్డబుల్ ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. సామ్‌సంగ్ జెడ్ ఫోల్డ్ 6 పేరుతో ఈ కొత్త ఫోన్‌ను తీసుకొస్తున్నారు. అయితే కంపెనీ ఇప్పటి వరకు ఈ ఫోన్‌కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ నెట్టింట కొన్ని ఫీచర్లు వైరల్ అవుతున్నాయి.

Samsung Smart Phoneసామ్‌సంగ్ జెడ్ ఫోల్డ్ సిరీస్‌లో భాగంగా గ్యాలక్సీ జెడ్ ఫ్లిప్ 6, జెడ్ ఫోల్డ్ 6 పేరుతో రెండు కొత్త ఫోన్‌లను లాంచ్ చేస్తోంది. నెట్టింట ఈ ఫోన్‌కు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. వీటి ప్రకారం సామ్‌సంగ్ ఈ ఫోన్‌ను గ్యాలక్సీ ఎస్24 అల్ట్రా లుక్‌లో తీసుకొస్తున్నట్లు స్పష్టమవుతోంది.

ఇక ఈ ఫోల్డబుల్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇందులో 12 జీబీ ర్యామ్‌తో పాటు 1 టీబీ వరకు స్టోరేజ్ కెపాసిటీతో ఫోన్‌ను తీసుకొస్తున్నట్లు సమాచారం.

కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక ఈ ఫోన్‌తో పాటు ఏడేళ్ల పాటు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్స్‌తో పాటు, సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందించనున్నట్లు తెలుస్తోంది.

సామ్‌సంగ్ జెడ్ ఫోల్డ్ 6 ఫోన్‌లో 6.7 ఇంచెస్‌తో కూడిన ఇంటర్నల్ ఫోల్డబుల్ డిస్‌ప్లేతో పాటు 3.4 ఇంచెస్‌తో కూడిన అవుటర్ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ ఫోన్‌లో 4000 ఎమ్‌ఏహెచ్‌తో కూడిన బ్యాటరీని ఇవ్వనున్నారు.





























