- Telugu News Photo Gallery Technology photos Samsung launches new smart phone Samsung Galaxy S24 FE Features and price details
Samsung Galaxy S24 FE: ఎట్టకేలకు వచ్చేస్తున్న సామ్‌సంగ్ కొత్త ఫోన్.. ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే..
సౌత్ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్‌సంగ్ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఈఫోన్‌ను భారత మార్కెట్లోకి లాంచ్ చేసింది. సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎస్24 ఎఫ్‌ఈ పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఇందకీ ఈ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Sep 29, 2024 | 12:50 PM

సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎస్24 ఎఫ్‌ఈ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ను బ్లూ, గ్రాఫైట్, గ్రే, మింట్, ఎల్లో వంటి కలర్స్‌లో లాంచ్ చేశారు. మొత్తం మూడు వేరియంట్స్‌లో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్‌లో 6.7 ఇంచెస్‌తో కూడిన డైనమిక్ అమోఎల్‌ఈడీ 2ఎక్స్ డిస్‌ప్లేను ఇచ్చారు. అక్టోబర్ 3వ తేదీ నుంచి ఈ ఫోన్ మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది.

ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, ఫుల్‌హెచ్‌డీ+ రిజల్యూషన్‌తో తీసుకొచ్చారు. అలాగే ఇందులో విజన్ బూస్టర్, 1,900 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్+ ప్రొటెక్షన్ వంటి ఫీచర్లను అందించారు. ఇక ఈ ఫోన్ Samsung Exynos 2400e SoC చిప్‌సెట్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

ఈ ఫోన్‌ను 8 జీబీ ర్యామ్‌తో పాటు.. 128/256జీబీ/512 జీబీ స్టోరేజ్ వేరియంట్స్‌తో తీసుకొచ్చారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత OneUI 6.1.1పై పనిచేస్తుంది. ఇందులో 25 ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4700 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు.

ఇక కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. 123˚ ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 12MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, OISతో 10MP టెలిఫోటో లెన్స్, 3x ఆప్టికల్ జూమ్, f/2.4 అపెర్చర్ వంటి ఫీచర్లను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 10 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.

ఇక సెక్యూరిటీ పరంగా ఇందులో ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్, ఆటో బ్లాకర్, సామ్‌సంగ్ నాక్స్, శామ్‌సంగ్ నాక్స్ వాల్ట్, శామ్‌సంగ్ నాక్స్ మ్యాట్రిక్స్, పాస్‌కీ వంటి ఫీచర్లను అందించారు. ధర విషయానికొస్తే 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 54,400కాగా, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 59,330, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను ఇంకా ప్రకటించలేదు.




