- Telugu News Photo Gallery Technology photos These are the top indian companies which have highest profit per day
Companies: దేశంలో అత్యధికంగా ఆదాయం వచ్చే కంపెనీలు ఏంటో తెలుసా.? రోజుకు ఏకంగా రూ. 200 కోట్లకుపైగా
భారత్ ఆర్థికంగా శక్తివంతమైన దేశంగా ఎదుగుతోంది. అన్ని రంగాల్లో భారీగా వృద్ధి కనిస్తోంది. విదేశీ ఎగుమతులు పెరిగాయి. ఈ నేపథ్యంలోనే దేశంలోని పలు ప్రధాన కంపెనీలు ఆరీగా ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. మరి మన దేశంలో అత్యధికంగా ఆదాయం వస్తున్న కంపెనీలకు సంబంధించి ఈటీ మనీ ఓ జాబితాను విడుదల చేసింది..
Updated on: Sep 29, 2024 | 12:19 PM

ఈటీ మనీ విడుదల చేసిన జాబితాలో రియలన్స్ ఇండస్ట్రీ మొదటి స్థానంలో నిలిచింది. దేశంలో రోజుకు అత్యధికంగా ఆదాయం ఆర్జిస్తున్న కంపెనీల్లో రిలయన్స్ మొదటి స్థానంలో ఉంది. 2024 ఏడాదికి సంబంధించి రియలన్స్ రోజుకు రూ. 216.50 కోట్లు ఆదాయాన్ని ఆర్జిస్తుంది. రియలన్స్ ఇండస్ట్రీస్‌లో ప్రధానంగా జియోతోనే ఎక్కువ ఆదాయం వస్తుందనే విషయం తెలిసిందే.

ఇక రెండో స్థానంలో ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ ఎస్‌బీఐ ఉంది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఖాతాదారులను కలిగి ఉన్న ఈ బ్యాంక్ ఆధారం రోజుకు రూ. 186.70 కోట్లుగా ఉన్నట్లు ఈటీ మనీ నివేదికలో తెలిపింది.

ఈటీ మనీ వెల్లడించిన జాబితాలో ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ మూడో స్థానంలో నిలిచింది. ఈ బ్యాంక్ రోజువారీ ఆదాయం ఏకంగా రూ. 179.30 కోట్లుగా ఉండడం విశేషం. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు కూడా దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఖాతాదారులు ఉన్నారు. ముఖ్యంగా హౌజింగ్ లోన్స్‌కు సంబంధించి ఈ బ్యాంక్ ముందు వరుసలో ఉంది.

భారత ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఈ జాబితాలో 4వ స్థానంలో ఉంది. దేశంలో ఉన్న అతిపెద్ద క్రూడ్ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ సంస్థ ఒక్క రోజు ఆదాయం ఏకంగా రూ. 156.40 కోట్లుగా ఉంది. తర్వాత స్థానంలో ప్రముఖ ఐటీ సంస్థ టీసీఎస్ ఉంది. ఈ కంపెనీ రోజువారీ ఆదాయం రూ. 126.30 కోట్లు.

ఇక ఈటీ మనీ విడుదల చేసిన జాబితాలో 6వ స్థానంలో ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ నిలిచింది. ఈ బ్యాంక్ రోజువారీ ఆదాయం రూ. 123.30 కోట్లుగా ఉంది. ఇక ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ రోజు వారీ ఆదాయం రూ. 118.2 కోట్లుగా ఉంది. అలాగే ఆ తర్వాతి స్థానంలో ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ ఎల్‌ఐసీ నిలిచింది. ఈ కంపెనీ ఒక్క రోజు ఆదాయం రూ. 112.10 కోట్లుగా ఉంది.




