గీలీకి చెందిన బ్రిటిష్ కార్ల తయారీ సంస్థ లోటస్ ఇటీవల తన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఎలిట్రీతో భారత మార్కెట్‌లోకి ప్రవేశించింది. ఈ కారు ధర ఏకంగా రూ.2.55 కోట్ల నుంచి రూ.2.99 కోట్ల వరకూ ఉండడంతో భారతదేశంలో అత్యంత ఖరీదైన ఈవీ కారుగా ఘనత చేజిక్కించుకుంది. ఈ కారు మూడు వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. ముఖ్యంగా ఈ కారు కేవలం 2.95 సెకన్లలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. అలాగే దాదాపు 20 నిమిషాల్లోనే 10 శాతం నుంచి 80 శాతం వరకూ చార్జ్ అవుతుంది.