- Telugu News Photo Gallery Technology photos IQoo launching new smartphone china iQOO Neo 10 Series features and price details
iQOO Neo 10 Series: ఐక్యూ నుంచి కొత్త సిరీస్ వస్తోంది.. ఫీచర్స్ తెలిస్తే వెంటనే కొనేస్తారు
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ, వివో సబ్ బ్రాండ్ అయిన ఐక్యూ కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచే స్తోంది. ఐక్యూ నియో 10 సిరీస్ పేరుతో ఈ ఫోన్‌ను తీసుకురానున్నారు. తొలుత చైనా మార్కెట్లోకి లాంచ్ చేయనున్నారు. ఇంతకీ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత ఉంటుంది.? ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Nov 18, 2024 | 1:34 PM

చైనాకు చెందిన టెక్ దిగ్గజం ఐక్యూ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. ఐక్యూ నియో 10 సిరీస్ పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తొలుత చైనా మార్కెట్లో లాంచ్ చేయనున్న ఈ ఫోన్‌ను ఆ తర్వాత ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేయనున్నారు.

ఇప్పటికే ఈ ఫోన్‌కు సంబంధించి ప్రీ ఆర్డర్స్ ప్రారంభమయ్యాయి. ఈ సిరీస్‌లో భాగంగా ఐక్యూ నియో 10 ప్రో మోడల్ ఆరెంజ్-గ్రే డ్యూయల్-టోన్ ఎండ్ అందుబాటులో ఉండనుంది. ఇక ఐక్యూ నియో 10 స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 3 ఎస్ఓసీ పని చేస్తుంది.

ప్రో విషయానికొస్తే ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9400 చిప్‌సెట్ తో పనిచేస్తుంది. ఐక్యూ నియో 10 ప్రో ఫోన్‌లో స్క్వేర్ షేప్‌లో డ్యూయల్ కెమెరా మాడ్యూల్ హౌసింగ్ స్క్వారీష్ కెమెరా సెన్సార్‌లను అందించనున్నారు.

కెమెరా మాడ్యూల్‌లో ఓఐఎస్ టెక్స్ట్ ప్రాథమిక సెన్సార్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌కు సపోర్ట్ చేయనుందని తెలుస్తోంది. ఇక ఈ ఫోన్‌ను ఈ నెలాఖరులో లేదా డిసెంబర్ మొదటి వారంలో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ ఫోన్‌లలో 1.5కే రిజల్యూషన్‌తో కూడిన డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. అలాగే ఇందులో 1000 డబ్ల్యూహెచ్‌కు సపోర్ట్ చేసే 6000 ఎమ్‌ఏహెచ్ కెపాసిటీ గల సిలికాన్ బ్యాటరీని ఇవ్వనున్నారని తెలుస్తోంది.




