ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవాలంటే.. మ్యాప్స్ యాప్ ఓపెన్ చేసి ప్రొఫైల్ మీద క్లిక్ చేయాలి.. తర్వాత ‘సెట్టింగ్స్’లోకి వెళ్లి ‘నేవిగేషన్ సెట్టింగ్స్’ ఎంచుకుని.. కిందకు స్క్రోల్ చేయాలి. అక్కడ కనిపించే ‘రూట్ ఆప్షన్’ అనే ట్యాబ్’లో ప్రిఫర్ ఫ్యుయల్ ఎఫిసెంట్ రూట్స్’ అనే ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవాలి. అటుపై మీ వాహనం ఇంజిన్, ఫ్యుయల్ రకం సెలక్ట్ చేసుకోవాలి. నేవిగేషన్ ట్యాబ్‌లోనే టోల్ ధర, స్పీడో మీటర్ వంటి ఆప్షన్లు ఎంచుకోవచ్చు. వాహన వేగంతోపాటు మీరు వెళ్లే రూట్‌లో ఎంత టోల్ ఫీజు పే చేయాలో ఈ ఫీచర్ చూపుతుంది.