- Telugu News Photo Gallery Technology photos Boat Release new smart watch boat Iris in indian market have a look on features and price details
BoAt Iris: భారత మార్కెట్లోకి మరో కొత్త స్మార్ట్ వాచ్ వచ్చేసింది.. అదిరిపోయే ఫీచర్లతో ఆకట్టుకుంటోన్న బోట్ ఐరిస్..
BoAt Iris: ప్రస్తుతం మార్కెట్లో రోజుకో కొత్త స్మార్ట్ వాచ్ హల్చల్ చేస్తున్న సమయంలో తాజాగా బోట్ కూడా కొత్త స్మార్ట్ వాచ్‌ను తీసుకొచ్చింది. బోట్ ఐరిస్ పేరుతో లాంచ్ చేసిన ఈ స్మార్ట్ వాచ్‌లో ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి..
Updated on: Dec 27, 2021 | 8:44 AM

ప్రముఖ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ తయారీ సంస్థ బోట్ తాజాగా కొత్త స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. బోట్ ఐరిస్ పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్ వాచ్ బోట్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది.

ఈ స్మార్ట్‌వాచ్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 1.39 అంగుళాల హై డెఫినిషన్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఈ స్మార్ట్ వాచ్.. మల్టిపుల్ క్లౌడ్- ఆధారిత వాచ్ ఫేస్‌లకు మద్దతిస్తుంది. ఇందలో హార్ట్ రేట్, ఎస్‌పీఓ2 మానిటర్‌ను ఇచ్చారు.

ఇందులో వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్, స్కిప్పింగ్, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్, స్విమ్మింగ్‌లో మీకు సహాయపడే 8 బిల్ట్-ఇన్ యాక్టివ్ స్పోర్ట్స్ మోడ్‌లను అందించారు. ఈ వాచ్‌ను ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 7 రోజుల బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది.

రౌండ్ డయల్‌తో రూపొందించిన ఈ స్మార్ట్ వాచ్‌లో బ్లడ్ ఆక్సిజన్ మానిటర్, హార్ట్ రేట్ మానిటర్, ఇతర స్పోర్ట్స్ మోడ్ ఫీచర్లతో తీసుకొచ్చారు.

మల్టిపుల్ స్పాట్స్ మోడ్, యాక్టివిటీ ట్రాకర్లతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ ధర విషయానికొస్తే బోట్ ఐరిస్ ఇండియాలో రూ. 4,499కి అందుబాటులో ఉంది.




