- Telugu News Photo Gallery Technology photos Boat Launches new budget smart watch Boat Wave Electra features and price details Telugu Tech News
Boat wave electra: బోట్ నుంచి అదిరిపోయే స్మార్ట్ వాచ్.. తక్కువ ధరలో ఊహకందని ఫీచర్లు..
ప్రముఖ వియరబుల్ బ్రాండ్ తాజాగా భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్ వాచ్‌ను లాంచ్ చేసింది. బోట్ వేవ్ ఎలక్ట్రా పేరుతో తీసుకొచ్చిన ఈ వాచ్‌లో తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే పీచర్లను అందించారు.
Updated on: Dec 24, 2022 | 9:51 PM

ప్రస్తుతం మార్కెట్లో రోజుకో కొత్త స్మార్ట్ వాచ్ సందడి చేస్తోంది. ముఖ్యంగా బడ్జెట్ ధరలో వాచ్‌లను లాంచ్ చేస్తున్నాయి. కంపెనీలు ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్ బ్రాండ్ బోట్ మార్కెట్లోకి కొత్త స్మార్ట్ వాచ్‌ను తీసుకొచ్చింది. బోట్ వేవ్ ఎలెక్ట్రా పేరుతో లాంచ్ చేసిన ఈ వాచ్ ఫీచర్లు, ధరపై ఓ లుక్కేయండి.

ఈ స్మార్ట్ వాచ్‌లో 1.81 ఇంచెస్ హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. ఈ వాచ్‌లో గరిష్టంగా 50 వరకు ఫోన్ కాంటాక్ట్స్‌ను స్టోర్ చేసుకోవచ్చు. ఆన్‌బోర్డ్ హెచ్‌డీ మైక్‌ను అందించారు. బ్లూటూత్ కాలింగ్‌తో వాచ్‌తోనే కాల్స్ మాట్లాడుకోవచ్చు.

బోట్ వేవ్ ఎలక్ట్రా వాచ్‌లో మల్టీ సెన్సార్ సిస్టమ్ అందించారు. దీంట్లోని 100+ స్పోర్ట్స్ మోడ్స్‌తో పాటు పాటు హార్ట్ రేట్, స్లీప్ మానిటర్, SpO2 ట్రాకింగ్, బ్రీత్ ట్రైనర్ వంటి ఫీచర్లతో యూజర్లు హెల్త్ ట్రాకింగ్ చేసుకోవచ్చు.

ఇక వాచ్‌ను బోట్ యాప్‌తో స్మార్ట్ ఫోన్‌ను లింక్ చేసుకోవచ్చు. దీని ద్వారా 100+ వాచ్ ఫేసెస్, విడ్జెట్స్, రెండు కన్వర్టబుల్ మెను స్టైల్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వాచ్ నుంచే స్మార్ట్‌ఫోన్‌లో మ్యూజిక్, కెమెరాను కంట్రోల్ చేసుకోవచ్చు.

బోట్ వేవ్ ఎలక్ట్రా స్మార్ట్ వాచ్‌ను సిలికాన్ స్ట్రాప్ లైట్ బ్లూ, బ్లూ, బ్లాక్, చెర్రీ బ్లాసమ్ కలర్స్‌లో అందించారు. ధర విషయానికొస్తే రూ. 1799కి అందుబాటులో ఉంది. వాచ్‌ను బోట్ అధికారిక వెబ్‌సైట్, అమెజాన్ నుంచి కొనుగోలు చేయవచ్చు.




