- Telugu News Photo Gallery Technology photos Google Intraducing new feature that can detect doctors precptions Telugu Tech News
Google: డాక్టర్ల అర్థంకాని రాతను ఇట్టే అర్థం చేసుకోవచ్చు.. కొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్న గూగుల్.
డాక్టర్లు మందుల చీటీపై రాసే రాతను గుర్తించడం అంత సులువు కాదు. గజిబిజీగా ఉండే ప్రిస్కిప్షన్‌ను గుర్తించడానికి సులభతరం చేసేందుకు గూగుల్ కొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది..
Updated on: Dec 25, 2022 | 12:20 PM

డాక్టర్లు మందుల చీటిలో రాసే రాత అంత సులువుగా ఎవరికీ అర్థం కాదు. కొన్ని సందర్భాల్లో మెడికల్ షాప్‌లో పనిచేసే వారు కూడా డాక్టర్ రాసిన మందు పేరేంటో తెలియక తికమక పడుతుంటారు. గజిబిజిగా ఉండే డాక్టర్ ప్రిస్కిప్షన్‌ను సులభంగా అర్థం చేసుకునేందుకు గూగుల్ ఓ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది.

భారత్‌లో నిర్వహించే 'గూగుల్ ఫర్ ఇండియా' కార్యక్రమంలో ఈ ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. డాక్టర్ల ప్రిస్కిప్షన్‌ను అర్థం చేసుకోవడానికి గూగుల్ కత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీని ఉపయోగించనున్నారు.

ఇందులోకోసం గూగుల్ లెన్స్ యాప్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా డాక్టర్ ప్రిస్కిప్షన్‌ను ఫొటో తీసి, ఫొటో లైబ్రరీకి అప్‌లోడ్ చేస్తే చాలు. వెంటనే గూగుల్ లెన్స్ యాప్ దాన్ని గుర్తించి డాక్టర్ రాతను విశ్లేషిస్తుంది. వెంటనే డాక్టర్ రాసిన మందులు వివరంగా కనిపిస్తాయి. ఇందుకోసం గూగుల్ మెడికల్ షాప్స్‌తో కలిసి పనిచేయనుంది.

ఈ ఫీచర్‌కు సంబంధించి త్వరలోనే క్లారిటీ రానుంది. ఫీచర్‌ను ఎప్పటి నుంచి అందుబాటులోకి తీసుకొస్తామన్న దానిపై గూగుల్ ఇంకా స్పష్టతనివ్వలేదు. ఈ ఫీచర్‌తో యూజర్లు సులభంగా మందులను గుర్తించవచ్చని గూగుల్ తెలిపింది.

ఇదిలా ఉంటే ఈ ఫీచర్‌తో పాటు గూగుల్ మరికొన్ని ఆసక్తికరమైన ఫీచర్లను తీసుకొస్తోంది. గూగుల్ పే యాప్‌ను మరింత సురక్షితంగా మార్చే ఫీచర్లను యాడ్ చేయనున్నట్లు గూగుల్ తెలిపింది. ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్‌లో ఏవైనా అవకతవకలు, అక్రమాలున్నట్టు ఫ్రాడ్ డిటెక్షన్ వ్యవస్థ గుర్తించినట్టయితే వెంటనే హెచ్చరించే ఏర్పాటు చేయనున్నట్లు గూగుల్ పేర్కొంది.





























