- Telugu News Photo Gallery Technology photos Best deals on smart watches in amazon under 2k with best features
Smart watch: స్మార్ట్‌వాచ్ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? వీటిపై కళ్లు చెదిరే డిస్కౌంట్స్
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ సెప్టెంబర్ 27వ తేదీ నుంచి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే అంతలోపే స్మార్ట్‌వాచ్‌లపై ఎర్లీ డీల్స్‌ను అందిస్తోంది. ఇందులో భాగంగా ఎంపిక చేసిన కొన్ని ఫోన్‌లపై ఏకంగా 90 శాతం వరకు డిస్కౌంట్స్‌ను అందిస్తున్నారు. ఇంతకీ అమెజాన్‌లో లభిస్తున్న అలాంటి కొన్ని బెస్ట్ డీల్స్‌కు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Sep 17, 2024 | 1:15 PM

boAt Wave Sigma 3 Smart Watch: బోట్ వేవ్ సిగ్మా 3 స్మార్ట్ వాచ్ అసలు ధర రూ. 8999కాగా ఏకంగా 83 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ఈ వాచ్‌ను రూ. 1499కే సొంతం చేసుకోవచ్చు. ఇందులో 700కిపైగా మోడ్స్‌ను అందించారు. అలాగే ఇందులో హార్ట్రేట్ మానిటరింగ్, స్లీప్ మానిటరింగ్ వంటి హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లను అందించారు.

Fastrack Limitless Fs1+: అమెజాన్‌లో లభిస్తోన్న బెస్ట్ డీల్స్‌లో ఇదీ ఒకటి. ప్రముఖ వాచ్ తయారీ సంస్థ ఫాస్ట్రాక్‌కు చెందిన ఈ వాచ్‌పై ఏకంగా 72 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. ఈ వాచ్ అసలు ధర రూ. 5995కాగా 72 శాతం డిస్కౌంట్‌తో రూ. 1699కే లభిస్తోంది. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో మల్టీస్పోర్ట్, యాక్టివిటీ ట్రాకర్, ఫోన్ కాల్, స్ట్రెస్ ట్రాకింగ్ వంటి ఫీచర్లను అందించారు.

Fire-Boltt Phoenix Ultra Luxury: అధునాతన ఫీచర్లతో కూడిన ఈ స్మార్ట్‌వాచ్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ వాచ్ అసలు ధర రూ. 12,499కాగా ఏకంగా 86 శాతం డిస్కౌంట్‌తో రూ. 1799కే లభిస్తోంది. ఫీచర్ల విషయానికొస్తే ఈ వాచ్‌లో 1.39 ఇంచెస్‌తో కూడిన స్క్రీన్‌ను అందించారు. 180 వాట్స్ పవర్‌తో కూడిన బ్యాటరీని ఇందులో అందించారు.

Noise Pulse 2 Max Smartwatch: ఈ స్మార్ట్ వాచ్ అసలు ధర రూ. 5999కాగా 77 శాతం డిస్కౌంట్‌తో రూ. 1399కి లభిస్తోంది. ఫీచర్ల విషయానికొస్తే ఈ వాచ్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌కి సపోర్ట్ చేస్తుంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 10 రోజులు నాన్‌స్టాప్‌గా పనిచేస్తుంది. 15 వాట్స్ బ్యాటరీని ఇందులో అందించారు.

Noise Twist Go Bluetooth: ఈ స్మార్ట్‌వాచ్ అసలు ధర రూ. 4,999కాగా అమెజాన్‌లో 68 శాతం డిస్కౌంట్‌తో రూ. 1599కి లభిస్తోంది. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 1.39 ఇంచెస్‌తో కూడిన స్క్రీన్‌ను అందించారు. వాయిస్ అసిస్టెంట్, మ్యూజిక్ కంట్రోల్, కాలిక్యూలేటర్ వంటి పీచర్లను ఇందులో ప్రత్యేకంగా అందించారు. ఈ వాచ్ బరువు 0.05గ్రాములుగా ఉంది.




