- Telugu News Photo Gallery Technology photos Best curved display phones under 30k, Check here for full details
Smart phone: కర్వ్డ్ డిస్‌ప్లే ఫోన్ కోసం సెర్చ్ చేస్తున్నారా.? తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ డీల్స్ ఇవే..
మార్కెట్లో రోజుకో కొత్త స్మార్ట్‌ఫోన్ సందడి చేస్తోంది. అధునాతన ఫీచర్లతో కూడిన ఫోన్‌లను తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం కర్వ్డ్ డిస్‌ప్లేలకు మార్కెట్‌లో ఆదరణ పెరుగుతోంది. మరి బడ్జెట్ ధరలో అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ కర్వ్డ్ డిస్‌ప్లే ఫోన్స్ ఏంటి.? వాటిలో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Sep 22, 2024 | 3:00 PM

Honor X9b: ఈ స్మార్ట్‌ఫోన్‌ను అల్ట్రా-బౌన్స్ యాంటీ-డ్రాప్ టెక్నాలజీతో తీసుకొచ్చారు. అమెజాన్‌లో ఈ ఫోన్ ధర రూ. 25,998కి లభిస్తోంది. ఇందులో 6.78 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 120Hz రిఫ్రెష్ రేట్, 1200 nits పీక్ బ్రైట్‌నెస్ ఈ స్క్రీన్ సొంతం. ఇందులో 108 ఎంపీతో కూడిన రెయిర్ కెమెరా ఈ ఫోన్ సొంతం.

iQOO Z9s: తక్కువ ధరలో అందుబాటులో ఉన్న మరో బెస్ట్ 3డీ కర్వ్డ్ డిస్‌ప్లే ఫోన్స్‌లో ఇదీ ఒకటి. ఐక్యూ జెడ్9 ఎస్ ఫోన్‌లో 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను ఇచ్చారు. ఈ పోన్ ధర రూ. 19,998గా నిర్ణయించారు. ఈ ఫోన్ MediaTek Dimensity 7300 5G ప్రాసెసర్‌తో పని చేస్తుంది. కెమెరా విషయానికొస్తే ఇందులో 50 ఎంపీ ప్రైమరీ కెమెరాను అందించారు. 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5500 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని ఇచ్చారు.

Moto G85: ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్‌లో రూ. 22,740కి లభిస్తోంది. ఈ ఫోన్‌లో కర్వ్డ్ డిస్‌ప్లేను అందించారు. మోటో జీ85 స్నాప్‌డ్రాగర్ 6ఎస్ జెన్3 ప్రాసెసర్‌ను ఇచ్చారు. 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే 8 ఎంపీతో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. ఇక బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు.

Oppo F27 Pro: ఒప్పో ఎఫ్27 స్మార్ట్ ఫోన్‌లో 6.7 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ అమోఎల్ఈడీ 3డీ కర్వ్డ్ డిస్‌ప్లేను అందించారు. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 8GB ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఈ ఫోన్ సొంతం. ధర విషయానికొస్తే రూ. 27,999కి లభిస్తోంది. 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు.

Realme 12 Pro: తక్కువ ధరలో అందుబాటులో ఉన్న బెస్ట్ ఫోన్స్‌లో రియల్‌మీ 12 ప్రో ఒకటి. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 26,999కి అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌లో 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన కర్వ్డ్ డిస్‌ప్లేను అందించారు. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 50 ఎంపీతో కూడిన రెయిర్ కెమెరాను, సెల్ఫీలు, వీడియోకాల్స్ కోసం 32 ఎంపీతో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. 67 వాట్స్ సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు.




