Apple Watch Ultra 2: ఆటోమేటిక్‌ స్ట్రోక్‌ డిటెక్షన్‌ ఫీచర్‌తో.. మార్కెట్లోకి యాపిల్ కొత్త వాచ్‌

ప్రపంచవ్యాప్తంగా యాపిల్ బ్రాండ్‌కు ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ బ్రాండ్‌ నుంచి కొత్త ప్రొడక్ట్‌ వచ్చిందంటే చాలు టెక్‌ మార్కెట్లో అలజడి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఐఫోన్‌16తో పాటు పలు ప్రొడక్ట్స్‌ను లాంచ్‌ చేసిన యాపిల్‌.. మార్కెట్లోకి వాచ్‌ అల్ట్రా 2 పేరుతో కొత్త వాచ్‌ను తీసుకొచ్చింది. ఈ వాచ్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Narender Vaitla

|

Updated on: Sep 22, 2024 | 2:55 PM

ప్రపంచ టెక్‌ దిగ్గజం యాపిల్ తాజాగా మార్కెట్లోకి వాచ్‌ అల్ట్రా2ని లాంచ్‌ చేసింది. అధునాతన ఫీచర్లతో ఈ వాచ్‌ను రూపొందించారు. ఈ వాచ్‌ ప్రీ బుకింగ్స్‌ ఇప్పటికే ప్రారంభం కాగా. తొలుత అమెరికా మార్కెట్లో సెప్టెంబర్ 20వ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకొచ్చింది.

1 / 5
ఈ వాచ్‌లో ఆటోమేటిక్‌ స్ట్రోక్‌ డిటెక్షన్ ఫీచర్‌ను అందించారు. దీంతో ముందుగానే గుండె సంబంధిత వ్యాధులను గుర్తించవచ్చని కంపెనీ చెబుతోంది. అలాగే ఈ వాచ్‌లో టర్న్-బై-టర్న్ నావిగేషన్ ఫీచర్‌ను అందించారు.

2 / 5
ఈ వాచ్‌కు దృఢమైన టైటానియం కేసును ఇచ్చారు. వాచ్ అల్ట్రా 2లో డ్యూయల్ ఫ్రీక్వెన్సీ GPSతో కూడిన అధునాతన పొజిషనింగ్ సాఫ్ట్‌వేర్‌ను ఇచ్చారు.  ఇప్పటి వరకు ఈ ఫీచర్‌ మరే స్పోర్ట్స్ వాచ్‌లో లేకపోవడం విశేషం.

3 / 5
రన్నర్స్‌, సైక్లిస్ట్‌లు, స్విమ్మింగ్ చేసే వాళ్లకు ఈ ఫీచర్‌ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ వాచ్‌లో ఆటోమేటిక్ స్ట్రోక్ డిటెక్షన్, ల్యాప్ కౌంట్స్, కొత్త ట్రైనింగ్ లోడ్ ఇన్‌సైట్స్ సిస్టమ్ వంటి హెల్త్‌ ఫీచర్లను అందించారు. డెప్త్ సెన్సార్ ఫీచర్‌ స్విమ్మింగ్ చేసే వాళ్లకు ఉపయోగపడుతుంది.

4 / 5
ఇక ఈ వాచ్‌లో స్క్రాచ్‌ రెసిస్టెంట్ కోసం పీవీడీ కోటింగ్‌తో శాటిన్ బ్లాక్ ఫినిషింగ్‌ను అందించారు. ఇది 95 శాతం రీసైకిల్ చేసిన గ్రేడ్ 5 టైటానియం నుంచి తయారు చేయడం విశేషం. ఇక ధర విషయానికొస్తే 799 డాలర్లుగా నిర్ణయించారు. ఇండియన్‌ కరెన్సీలో చెప్పాలంటే సుమారు రూ. 67 వేలు.

5 / 5
Follow us