- Telugu News Photo Gallery Technology photos Best camera smartphones under 20k check here for full details
Best Camera Phone: మంచి కెమెరా ఫోన్ కోసం చూస్తున్నారా.? రూ. 20 వేల బడ్జెట్‌లో..
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ కేవలం ఫోన్ మాట్లాడుకునేందుకు ఉపయోగించే గ్యాడ్జెట్ మాత్రమే కాదు.. కెమెరా కూడా. అందుకే మంచి క్వాలిటీ ఉన్న కెమెరా కోసం ఎక్కువ మంది ప్రాధాన్యత ఇస్తున్నారు. మరి తక్కువ ధరలో అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ స్మార్ట్ ఫోన్స్, వాటి ఫీచర్లపై ఓ లుక్కేయండి..
Updated on: May 11, 2024 | 7:09 PM

Motorola g64 5G: మోటోరోలా జీ64 5జీ స్మార్ట్ ఫోన్ రూ. 17,930గా ఉంది. ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే ఇందులో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. ఈ ఫోన్‌లో 6.5 ఇంచెస్‌తో కూడిన ఫుల్ హెచ్‌డీ+ స్క్రీన్‌ను ఇచ్చారు.

OnePlus Nord CE 2 Lite 5G: ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 18,999గా ఉంది. ఇందులో 6.43 ఇంచెస్‌తో కూడిన ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 64 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్పీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు.

realme 11 5g price: రియల్ మీ 11 5జీ స్మార్ట్ ఫోన్ ధర రూ. 18,599గా ఉంది. ఇందులో 108 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే ఇందులో 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. ఇందులో 67 వాట్స్ సూపర్వూక్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు. ఈ ఫోన్ డైమెన్సిటీ 6100+ 5జీ చిప్‌సెట్ ప్రాసెసర్‌ను అందించారు.

realme 12: రియల్ మీ12 స్మార్ట్ ఫోన్ ధర రూ. 17,999గా ఉంది. ఇందులో 108మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. 6.72 ఇంచెస్‌తోకూడిన ఫుల్‌హెచ్‌డీ+ స్క్రీన్‌ను ఇచ్చారు. 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ సొంతం.

Vivo T3 5G price: ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 19,999గా ఉంది. ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన సోనీ ఐఎమ్‌ఎక్స్882 ఓఐఎస్ సెన్సర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. 44 వాట్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు. 6.67 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ స్క్రీన్‌ను అందించారు.




