- Telugu News Photo Gallery Technology photos Amazon great summer sale huge discount on oneplus Nord CE 3 smart phone
Nord CE 3: రూ. 27 వేల ఫోన్ రూ. 19వేలకే.. వన్‌ప్లస్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్..
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ప్రస్తుతం గ్రేట్ సమ్మర్ సేల్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సేల్‌లో భాగంగా పలు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌పై భారీ డిస్కౌంట్స్‌ను ప్రకటించాయి. ఈక్రమంలోనే పలు స్మార్ట్ ఫోన్స్‌పై కూడా ధర తగ్గింపు అందిస్తున్నారు. ఇందులో భాగంగానే వన్‌ప్లస్ బ్రాండ్‌కి చెందిన ఫోన్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ డీల్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: May 06, 2024 | 8:23 PM

రూ. 27 వేల ఫోన్ రూ. 19వేలకే.. వన్‌ప్లస్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్..

వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 5జీ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్‌ను 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో తీసుకొచ్చారు. బ్లూటూత్, వైఫై, ఎన్‌ఎఫ్‌సీ వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందించారు. ఈ ఫోన్ బరువు 184 గ్రాములుగా ఉంది.

ఇక ఈ ఫోన్‌లో 6.7 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ ఫుల్‌హెచ్‌డీ+ స్క్రీన్‌ణు అందించారు. 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌ను అందించారు. 2412 x 1080 పిక్సెల్స్ ఈ స్క్రీన్ సొంతం. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 782జీ ప్రాసెసర్‌ను అందించారు.

కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. సోనీ ఐమ్యాక్స్3555 కెమెరాను అందించారు.

ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫాస్ట్ ఛార్జింగ్ వంటి అదనపు ఫీచర్లు ఈ ఫోన్ సొంతం. ఈ ఫోన్‌లో 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు. ఇదిలా ఉంటే ఈ అమెజాన్ సేల్ మే నెల 7వ తేదీతో ముగియనుంది.





























