Ramadan Fast: మధుమేహంతో బాధపడేవారు ప్రతిరోజు రంజాన్ ఉపవాసంలో వీటిని తీసుకోండి.. ఇలా చేస్తే ఎలాంటి సమస్య ఉండదట..

రంజాన్ ఉపవాస సమయంలో ప్రతిరోజూ రక్తంలో చక్కెరను చెక్ చేసుకోండి. అవసరమైతే వైద్య సలహా తీసుకోండి..

Sanjay Kasula

|

Updated on: Mar 27, 2023 | 3:20 PM

రంజాన్ మాసం కొనసాగుతోంది. నిబంధనలు పాటించాలని మతస్థులు ఉపవాస దీక్షలు ప్రారంభించారు. నెల రోజులపాటు ఉపవాసం ఉండాలనే నియమం ఉంది. సూర్యోదయానికి ముందు సెహ్రీ తినడంతో ఉపవాసం ప్రారంభమవుతుంది. సూర్యాస్తమయం తర్వాత ఇఫ్తార్‌తో ఉపవాసం విరమిస్తారు.

1 / 8
ప్రస్తుతం చాలా మంది మధుమేహంతో బాధపడుతున్నారు. ఈ సమస్య రోజురోజుకూ ముదురుతోంది. ఉపవాసం ఉన్నప్పుడు షుగర్ ఉన్నవారు చాలా మంది ఉన్నారు. కాబట్టి వారు నియమాల ప్రకారం ఉపవాసం ఉండాలి. శరీర ఆరోగ్య పరిస్థితిని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి.

2 / 8
అవసరమైతే వైద్యుడిని సంప్రదించండి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి మందులు ఎప్పుడు తీసుకోవాలో డాక్టర్ ఓ మంచి సలహా ఇస్తాడు. ఏ సమయంలో ఎలాంటి ఆహారం తినాలో కూడా చెబుతాడు.

3 / 8
మీరు ఉపవాసం ఉన్నప్పటికీ.. మీరు మీ రక్తంలో చక్కెరను క్రమం తప్పకుండా చెక్ చేసుకోవాలి. రోజుకు కనీసం రెండుసార్లు చెక్ చేసుకోండి. మీకు ఏదైనా సమస్య అనిపిస్తే.. వెంటనే వైద్యులను సంప్రదించడానికి ఆలస్యం చేయవద్దు.

4 / 8
ఉపవాస సమయంలో దాదాపు 12 గంటల పాటు ఉపవాసం ఉండవలసి ఉంటుంది కాబట్టి, ఈ సమయంలో శరీరం హైడ్రేట్ గా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉపవాసానికి ముందు.. తరువాత పుష్కలంగా నీరు త్రాగాలి.

5 / 8
సెహ్రీ లేదా ఇఫ్తార్ సమయంలో అతిగా తినవద్దు. అదనపు ఆహారం తసుకోవద్దు. తేలికపాటి భోజనం, తెలివిగా తినండి. లేదంటే ఆహారం జీర్ణం కావ‌డంలో స‌మ‌స్యలు వ‌స్తాయి. అదనపు స్వీట్లు లేదా బంగాళదుంపలు అస్సలు తీసుకోవద్దు.

6 / 8
చక్కెర తక్కువగా ఉండే పండ్లను తినండి. పుచ్చకాయ, దోసకాయ, యాపిల్, నిమ్మ, కివీ పండు ఎక్కువగా తినాలి. మీరు వెన్న కూడా తీసుకోవచ్చు. ఎక్కువ సేపు పొట్ట నిండుగా ఉండే ఆహారాలు తినండి.

7 / 8
ఉపవాసంతో పాటు మంచి నిద్ర వచ్చేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో జీవ గడియారంలో కొన్ని మార్పులు సంభవిస్తాయి. కాబట్టి నిద్రపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం.

8 / 8
Follow us