- Telugu News Photo Gallery Suryapet District: Villagers witnesses unique wedding between Peepal and Neem Tree
Rare Tree Marriage: రావి, వేప చెట్లకు అరుదైన పెళ్లి.. వేడుకను తిలకించేందుకు తరలివచ్చిన సమీప గ్రామాల ప్రజలు..
వర్షాలు కురవాలని కప్పలకు పెళ్లిళ్లు చేయడం వినే ఉంటాం. ప్రతి దేవాలయంలో వేప, రావి చెట్లకు పూజలు చేయడం సహజమే. కానీ సంతానం కలగాలని, దోషాలన్నీ తొలగిపోవాలని కలిసి ఉన్న రావి, వేప చెట్లకు పెళ్లి చేశారు ఓ గ్రామస్తులు. ఈ పెళ్లి వేడుకను తిలకించేందుకు సమీప గ్రామాల ప్రజలు తరలివచ్చారు.
Updated on: Jul 08, 2023 | 11:07 AM

వర్షాలు కురవాలని కప్పలకు పెళ్లిళ్లు చేయడం వినే ఉంటాం. ప్రతి దేవాలయంలో వేప, రావి చెట్లకు పూజలు చేయడం సహజమే. కానీ సంతానం కలగాలని, దోషాలన్నీ తొలగిపోవాలని కలిసి ఉన్న రావి, వేప చెట్లకు పెళ్లి చేశారు ఓ గ్రామస్తులు.

వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది.స్థానికంగా ఉన్న పూసల సంఘం కళ్యాణ మండపంలో పెనవేసుకున్న వేప - రావి చెట్లు ఉన్నాయి.

వేప చెట్టును విష్ణువు.. రావి చెట్టు లక్ష్మీదేవిగా భావిస్తుంటారు. దీంతో సంఘం సభ్యులు శుభం కలగాలని వేప - రావి చెట్లకు భక్తి శ్రద్ధలతో కుటుంబ సభ్యులతో కలిసి వివాహం జరిపించారు.

కలిసి ఉన్న వేప - రావి చెట్ల బంధానికి పెళ్లి చేస్తే కుజ దోషం, కాల సర్ప దోషం, నష్ట దోషాలు తొలగి పోతాయని, సంతానం కలుగుతుందని నమ్ముతున్నారు. సాధారణ పెళ్లి మాదిరిగానే పెళ్లి అనంతరం సంఘ సభ్యులు అన్నదానం చేశారు.

రావి, వేప చెట్లకు పెళ్లి కార్యక్రమాన్ని తిలకించేందుకు సమీప గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
