- Telugu News Photo Gallery Spiritual photos Summer Travel Tips: Trimbakeshwar to bhimashankar ancient shiva temples of Maharashtra
Maharastra: వేసవిలో మహారాష్ట్ర పర్యటన బెస్ట్ ఎంపిక.. పురాతనం, అద్భుతమైన శైవ క్షేత్రాల వివరాల్లోకి వెళ్తే..
వేసవి కాలం వచ్చేసింది. పిల్లలకు స్కూల్స్ కు సెలవులు ఇస్తారు. సుదీర్ఘమైన ఈ వేసవి సెలవుల్లో తమ కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కడికైనా ట్రిప్ కి వెళ్ళడానికి ప్లాన్ చేస్తారు కొందరు. మీరు ఆధ్యాత్మిక యాత్రను ప్లాన్ చేస్తుంటే మహారాష్ట్రకు వెళ్లడం మీకు జీవితాంతం గుర్తుండిపోయే అనుభవం అవుతుంది. ఇక్కడ శివునికి సంబంధించిన రెండు జ్యోతిర్లింగ క్షేత్రాలు మాత్రమే కాదు..అనేక ఇతర గొప్ప, పురాతన శివాలయాలు కూడా ఉన్నాయి.
Surya Kala | Edited By: Ravi Kiran
Updated on: Mar 26, 2025 | 2:00 PM

మహారాష్ట్ర భిన్న సంస్కృతి, సాంప్రదాయ ఆహారానికి ప్రసిద్ధి చెందిన ప్రదేశం. అంతేకాదు ఆధ్యాత్మిక ప్రయాణికులకు కూడా గొప్ప గమ్యస్థానం. ముఖ్యంగా ఎవరైనా వేసవి సెలవుల్లో ఏదైనా ఆధ్యాత్మిక యాత్ర చేయాలనీ.. ముఖ్యంగా శైవ క్షేత్రాలను దర్శించుకోవాలని ఆలోచిస్తున్నట్లు అయితే మహారాష్ట్ర ఎంపిక మంచి ఎంపిక. ఇక్కడ అనేక పవిత్రమైన, పురాతనమైన శివాలయాలు ఉన్నాయి. కనుక కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో కలిసి వీటిని సందర్శించడం అద్భుతమైన అనుభవంగా ఉంటుంది.

మహారాష్ట్రలో ఎప్పుడు సందడితో ఉండే ప్రదేశాలున్నాయి. ప్రకృతి అందాలతో నిండి ఉన్న ప్రాంతాలతో పాటు, ఆధ్యాత్మిక క్షేత్రాలు కూడా పర్యాటకులను, భక్తులను ఆకర్షిస్తూ ఉంటాయి. ఇక్కడ అనేక శివుని ఆలయాలు ఉన్నాయి. అక్కడ మీరు ఆధ్యాత్మిక శాంతిని పొందుతారు. ఆ ఆలయాల వైభవం చూడడానికి రెండు కళ్ళు చాలవు అనిపిస్తుంది. ఆ క్షేత్రాలు ఏమిటో తెలుసుకుందాం..

త్రయంబకేశ్వర్ ఆలయం: శివయ్య భక్తులు తమ జీవితంలో ఒక్కసారైనా ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలను దర్శించుకోవాలని కోరుకుంటారు. అటువంటి 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం మహారాష్ట్రలో ఉంది. నాసిక్ లో ఉన్న ఈ త్రయంబకేశ్వర ఆలయాన్ని దర్శించుకోవడం, పూజలను చేయడం వలన కాల సర్ప దోషం తోలగుతుందని నమ్మకం.

భీమశంకర జ్యోతిర్లింగం: మహారాష్ట్రలోని పూణే జిల్లాలో భీమశంకర అనే మరో శివ జ్యోతిర్లింగ క్షేత్రం కూడా ఉంది. ఈ ఆలయం సహ్యాద్రి పర్వతంపై ఉంది. ఇక్కడ శివయ్యను మోతేశ్వర మహాదేవ అని కూడా పిలుస్తారు. ఈ జ్యోతిర్లింగం దగ్గర భీమ నది కూడా ప్రవహిస్తుంది. వేసవిలో చూడదగిన ఆధ్యాత్మిక క్షేత్రం.

ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం: మహారాష్ట్రలోని ఎల్లోరా గుహల సమీపంలో ఔరంగాబాద్ జిల్లాలో ఉన్న ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఆఖరిది. భక్తుడి పూజకు మెచ్చి మరణించిన అతని కుమారుడికి ప్రాణం పోసిన క్షేత్రంగా ప్రసిద్దిగంచింది.

ఔంధ నాగనాథ్ ఆలయం: మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో ఉన్న ఔంధ నాగనాథ్ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం కూడా చాలా పురాతనమైనది. ఈ ఆలయం దాదాపు 7200 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఈ ఆలయంలోని అందమైన శిల్పాలు కూడా పర్యాటకులను ఆకర్షిస్తాయి.

అంబర్నాథ్ ఆలయం: మహారాష్ట్రలో శివుడికి అంకితం చేయబడిన అంబర్‌నాథ్ ఆలయం ఉంది. దీనిని ప్రజలు అంబేశ్వర్ ఆలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం పాండవుల కాలంలో నిర్మించబడిందని నమ్ముతారు. మీరు మహారాష్ట్రకు వెళితే ఈ ఆలయాన్ని సందర్శించడం మీకు మధుర జ్ఞాపకంగా మిగులుతుంది.

మహాబలేశ్వర్ ఆలయం: మహారాష్ట్రలోని సతారా జిల్లాలో పశ్చిమ కనుమలలో మహాబలేశ్వర్ అని పిలువబడే చాలా అందమైన ప్రదేశం ఉంది. ఇది మహారాష్ట్రలో అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం. దీనికి కారణం ఇక్కడ ఉన్న పచ్చని అడవులు, అందమైన పర్వతాలు, లోయలు , జలపాతాలు. అంతేకాదు పర్యాటకులను ఎక్కువగా ఆకర్షించించేది మహాబలేశ్వర్ శివాలయం.





























