AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi Golf Club League: మూడు వారాలు.. 462 మంది గోల్ఫర్స్.. ముగిసిన ఢిల్లీ గోల్ఫ్ లీగ్ 3వ ఎడిషన్..

Delhi Golf Club League: ఒలింపిక్ క్రీడల్లో భాగమైన గోల్ఫ్ క్రీడను ప్రోత్సహించడానికి, యువతలోని ప్రతిభను వెలికి తీసేందుకు ఢిల్లీ గోల్ఫ్ క్లబ్ ఒక వేదికను నెలకొల్పింది. దీనికి టీవీ9 నెట్‌వర్క్ కూడా చేతులు కలపడం విశేషం. అక్టోబర్ 12 నుంచి ప్రారంభమైన ఈ లీగ్‌లో మొత్తం 462 మంది గోల్ఫర్లు పాల్గొన్నారు. ఈ ఏడాది వచ్చిన అద్భుతమైన స్పందనే తమ విజయానికి నిదర్శనమని ఢిల్లీ గోల్ఫ్ క్లబ్ కెప్టెన్ రాజ్ ఖన్నా అన్నారు.

Venkata Chari
|

Updated on: Nov 05, 2023 | 8:47 AM

Share
ఢిల్లీలో జరుగుతున్న లాయిడ్ గోల్ఫ్ క్లబ్ లీగ్ మూడో ఎడిషన్ ముగిసింది. అక్టోబర్ 12 నుంచి ప్రారంభమైన ఈ లీగ్‌లో మొత్తం 462 మంది గోల్ఫర్లు పాల్గొన్నారు. ఢిల్లీలోని పార్-72 గోల్ఫ్ క్లబ్‌లో 3 వారాల పాటు జరిగిన ఈ టోర్నమెంట్ ఈసారి చాలా మంది యువ ప్రతిభావంతులు కనిపించడం విశేషం.

1 / 6
ఈ యువ గోల్ఫ్ క్రీడాకారులు నోనితా లాల్ ఖురేషి, అమిత్ లూథ్రా, గౌరవ్ ఘీ, వివేక్ భండారి, చిరాగ్ కుమార్, అమన్‌దీప్ జోహల్ వంటి ప్రసిద్ధ భారతీయ గోల్ఫర్‌లు కూడా సందడి చేశారు. వీరి నుంచి యువ క్రీడాకారులకు విలువైన సూచనలు, సలహాలు పొందారు. అంతేకాకుండా వీరితో పాటు టీమిండియా మాజీ కెప్టెన్/గోల్ఫ్ ప్లేయర్ కపిల్ దేవ్ కూడా ఈ లీగ్‌లో కనిపించాడు.

2 / 6
ఢిల్లీ గోల్ఫ్ క్లబ్ చేస్తున్న ఈ ప్రయత్నానికి టీవీ9 నెట్‌వర్క్ కూడా చేతులు కలపడం విశేషం. గోల్ఫ్ క్లబ్ లీగ్ మూడవ ఎడిషన్‌ను TV9 నెట్‌వర్క్, లాయిడ్స్, రాడికో, మెర్సిడెస్-బెంజ్ వంటి అనేక కంపెనీలు స్పాన్సర్ చేశాయి.

3 / 6
టోర్నమెంట్‌ కమిటీ చైర్మన్‌ కమోడోర్‌ శరత్‌ మోహన్‌ సమ్మత్‌ మాట్లాడుతూ గోల్ఫ్‌ ఒలింపిక్‌ క్రీడ అని, ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు, గుర్తించేందుకు వేదికను ఏర్పాటు చేశామన్నారు. దీని కోసం మేం ఒక సాధారణ మోడల్, ఒక ఫ్లాట్ గ్రౌండ్ సిద్ధం చేశామని తెలిపారు.

4 / 6
ఈ లీగ్‌లో, సీనియర్ సభ్యులు జూనియర్ గోల్ఫర్‌లతో ఆడారు. క్లబ్‌లోని గోల్ఫ్ ఎకోసిస్టమ్‌తో యువ ప్రతిభావంతులు కలిసిపోవడానికి ఇది మరింత వీలు కల్పిస్తుందని శరత్ మోహన్ సమ్మత్ విశ్వాసం వ్యక్తం చేశారు.

5 / 6
ఢిల్లీ గోల్ఫ్ క్లబ్ ఏకైక లక్ష్యం భారతీయ గోల్ఫ్‌ను ప్రోత్సహించడమే. ఇది ప్రతిభను ప్రోత్సహిస్తుంది. స్నేహాన్ని కూడా ప్రోత్సహిస్తుంది. ఈ ఏడాది వచ్చిన అద్భుతమైన స్పందనే తమ విజయానికి నిదర్శనమని ఢిల్లీ గోల్ఫ్ క్లబ్ కెప్టెన్ రాజ్ ఖన్నా అన్నారు.

6 / 6