Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weekly Horoscope: వారు ఇతరుల వివాదాల్లో జోక్యం చేసుకోవద్దు.. 12రాశుల వారికి వారఫలాలు

వార ఫలాలు (జూలై 6-12, 2025): మేష రాశి వారికి ఈ వారం ఆదాయ వృద్ధికి సంబంధించిన ఏ ప్రయత్నమైనా కలిసి వస్తుంది. ఆర్థిక సమస్యలు బాగా తగ్గిపోతాయి. వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. మిథున రాశి వారికి అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..

TV9 Telugu Digital Desk
| Edited By: Janardhan Veluru|

Updated on: Jul 06, 2025 | 5:31 AM

Share
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): శుభ గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక వ్యవహారాలను, ఆర్థిక లావాదేవీలను చక్కదిద్దుకోవడం మంచిది. ఆదాయ వృద్ధికి సంబంధించిన ఏ ప్రయత్నమైనా కలిసి వస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో కొన్ని సానుకూల మార్పులు, శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అధికారుల నుంచి కొత్త ప్రోత్సాహకాలను అందుకుంటారు. వ్యాపారాలు లాభాలపరంగా కొత్త పుంతలు తొక్కుతాయి. ఆర్థిక సమస్యలు బాగా తగ్గిపోతాయి. అనుకున్న పనుల్ని సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. తోబుట్టువులతో ఆస్తి వివాదాలను రాజీ మార్గంలో పరిష్కరించుకుంటారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. పెళ్లి ప్రయత్నాలు ఆశాజనకంగా సాగిపోతాయి. నిరుద్యోగులకు ఊహించని అవకాశాలు అందుతాయి. కుటుంబ జీవితం చాలావరకు హ్యాపీగా, సానుకూలంగా సాగిపోతుంది.

1 / 12
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): రాశ్యధిపతి శుక్రుడు ఇదే రాశిలో ఉన్నందువల్ల కొన్ని వివాదాలు, ఒత్తిళ్ల నుంచి బయటపడడం జరుగుతుంది. అనేక విధాలుగా మనశ్శాంతి కలుగుతుంది. ఆరోగ్యం బాగా కుదుటపడుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఒక ప్రముఖుడుగా గుర్తింపు పొందుతారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా పూర్తి అవుతాయి. అదనపు ఆదాయం కూడా బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగానికి ఆఫర్ అందే అవకాశం ఉంది. ఉన్నత స్థాయి కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి కుదిరే సూచనలున్నాయి.

2 / 12
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): రాశ్యధిపతి బుధుడు ధన స్థానంలో బలంగా ఉన్నందువల్ల ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండకపోవచ్చు. షేర్లు, స్పెక్యులేషన్లతో సహా అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కీలక మార్పులు చేపట్టి లబ్ధి పొందుతారు. ఆర్థిక, కుటుంబ వ్యవహారాల్లో కొత్త నిర్ణయాలు తప్పకుండా సత్ఫలితాలనిస్తాయి. ఇష్టమైన మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. ఆస్తి వివాదాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. తల పెట్టిన పనుల్లో కొద్దిగా శ్రమాధిక్యత ఉంటుంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు కలిసి వస్తాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక విషయాల్లో ఎవరికీ మాట ఇవ్వక పోవడం శ్రేయస్కరం. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది.

3 / 12
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): లాభ స్థానంలో శుక్రుడు, ధన స్థానంలో కుజుడి సంచారం వల్ల ఆదాయానికి లోటుండదు. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. బంధువుల నుంచి ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులతో సమస్యలు పరిష్కారమై సాన్నిహిత్యం పెరుగుతుంది. స్నేహితుల వల్ల కొద్దిగా డబ్బు నష్ట పోయే అవకాశం ఉంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది.

4 / 12
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): రాశ్యధిపతి రవి లాభ స్థానంలో ఉండడం వల్ల కీలక విషయాల్లో విజయాలు, సాఫల్యాలు కలుగుతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. హోదాతో పాటు జీతభత్యాలు పెరిగే అవకాశం కూడా ఉంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. ఆస్తి వివా దాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ధనపరంగా ఇతరులకు మాట ఇవ్వకపోవడం మంచిది. ఇచ్చిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉండకపోవచ్చు.  కొందరు బంధువుల వల్ల ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే సూచనలున్నాయి. అధికారుల వల్ల మానసిక ఒత్తిడికి గురవుతారు. వృత్తి జీవితంలో ఏమాత్రం తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. రియల్ ఎస్టేట్, లిక్కర్, రాజకీయాలు వంటి రంగాల్లో ఉన్నవారికి బాగా అనుకూల వాతావరణం కనిపిస్తోంది.

5 / 12
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): రాశ్యధిపతి బుధుడు లాభ స్థానంలో, భాగ్యాధిపతి శుక్రుడు భాగ్య స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయవంతం అవుతుంది. ఉద్యోగంలో అధికారులు ఎక్కువగా ఆధారపడతారు. తప్పకుండా పదోన్నతి లభి స్తుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్నవారి కల నెరవేరుతుంది. వృత్తి జీవితం బిజీగా సాగి పోతుంది. వ్యాపారాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. ఇంటికి బంధువుల రాకపోకలుంటాయి. ముఖ్యమైన ఆర్థిక ప్రయత్నాలు ఆశించిన దాని కంటే ఎక్కువగా సత్ఫలితాలనిస్తాయి. స్నేహితుల సహాయంతో అత్యవసర పనులు పూర్తవుతాయి. దైవకార్యాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది.

6 / 12
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): భాగ్య స్థానంలో గురు, రవులు, దశమ స్థానంలో బుధుడి సంచారం కారణంగా కెరీర్ పరంగా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం కలుగు తుంది. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. నిరుద్యో గులకు ఊహించని ఆఫర్లు అందుతాయి. ఆదాయం బాగా పెరగడానికి అవకాశం ఉంది కానీ, దాంతో పోటీగా ఖర్చులు కూడా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నా ఫలితం ఉంటుంది. ముఖ్యంగా వృత్తి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా ‍సాగిపోతుంది. అవి వాహితులకు దూర ప్రాంత బంధువుల నుంచి శుభవార్త అందుతుంది. అనుకోకుండా ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది.

7 / 12
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): రాశ్యధిపతి కుజుడు దశమ స్థానంలో కేతువుతో కలిసి ఉండడం వల్ల ఉద్యోగంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయి. పదోన్నతి లభించడానికి, జీతభత్యాలు అంచనాలకు మించి పెరగడానికి, స్థాన చలనానికి బాగా అవకాశం ఉంది. ఆదాయం బాగానే ఉంటుంది. ఆదాయాన్ని మెరుగుపరచుకోవడానికి కొత్త మార్గాలు కలిసి వస్తాయి. ఖర్చులు తగ్గించుకుని, పొదుపు పాటిస్తారు. ఒకటి రెండు ఆర్థిక సమస్యలను పరిష్కరించుకుంటారు. ఇల్లు, వాహనం కొనాలనే ఆలోచన చేస్తారు. వృత్తి, ఉద్యోగాలు మెరుగ్గా ఉంటాయి. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. రాబడి మార్గాలు అనుకూలంగా ఉంటాయి. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు తప్పకుండా అందుతాయి. పిల్లల నుంచి ముఖ్యమైన శుభవార్తలు వింటారు. దాంపత్య జీవితం అనుకూలంగా సాగిపోతుంది.

8 / 12
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాడ 1): రాశ్యధిపతి గురువు సప్తమ స్థానంలో రవితో కలిసి ఉండడం వల్ల, కుజుడు భాగ్య స్థానంలో ఉండడం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఏ ప్రయత్నం చేపట్టినా విజయ వంతం అవుతుంది. ఆదాయానికి లోటుండకపోవచ్చు. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు కూడా లభిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీ ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. అధికార యోగం పట్టే అవకాశం ఉంది. వ్యాపారాలు సాఫీగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. దైవ కార్యాలకు హాజరవుతారు. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ, చేపట్టిన పనుల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు.

9 / 12
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): రాశ్యధిపతి శనితో పాటు శుక్రుడు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వారమంతా సాఫీగా, హ్యాపీగా సాగిపోయే అవకాశం ఉంది. ఉద్యోగ జీవితంలో అనుకూలతలు, ఆదరణలు పెరుగుతాయి. అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక విషయాల్లో కొద్దిపాటి ఒడిదుడుకుల తప్పకపోవచ్చు. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. వృత్తి జీవితం బిజీ అయిపోతుంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. బంధుమిత్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. ఒక వ్యక్తిగత సమ స్యకు పరిష్కారం లభిస్తుంది. ఇతరుల వివాదాల్లో కల్పించుకోవద్దు. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు.

10 / 12
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): రాశ్యధిపతి శని ధనస్థానంలో ఉండడం వల్ల ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. ఆదాయానికి లోటుండదు. కొద్దిగా ఆలస్యంగానైనా రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. కుటుంబ సభ్యులతో తొందరపాటుతో వ్యవహరించకపోవడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో పని భారం కాస్తంత ఎక్కువగా ఉంటుంది. వ్యాపారాల్లో కూడా లాభాలు నిలకడగా ముందుకు వెడతాయి. పెండింగ్ పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలను చక్కబెడతారు. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉన్నప్పటికీ అదనపు ఆదాయ ప్రయత్నాలను పట్టుదలగా కొనసాగిస్తారు. ప్రయాణాలలో, ఆహార నియమాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఉద్యోగపరంగా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. సొంత పనులు మీద దృష్టి పెట్టడం మంచిది. పెళ్లి ప్రయత్నాల్లో ఆశాభంగాలు

11 / 12
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): రాశ్యధిపతి గురువు చతుర్థ స్థానంలో రవితో కలిసి ఉన్నందువల్ల ఉద్యోగంలో ప్రాధాన్యానికి, గౌరవ మర్యాదలకు ఇబ్బందేమీ ఉండదు. సామాజికంగా కూడా పలుకుబడి పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలు చాలా వరకు అనుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాలు కలిసి వస్తాయి. ఒకటి రెండు వ్యక్తి గత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగుపడుతుంది. ఆర్థికంగా ఏ ప్రయత్నం తలపెట్టినా అది తప్పకుండా సఫలం అవుతుంది. రావలసిన సొమ్ముతో పాటు, బాకీలు, బకాయిలు కూడా వసూలవుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందుతుంది. అనారోగ్య సమస్యల నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ప్రేమ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. బంధువుల్లో పెళ్లి సంబంధం కుదురుతుంది.

12 / 12