- Telugu News Photo gallery Spiritual photos Vastu tips plant for home do not plant these trees happiness and prosperity will go away in telugu
Plant for Vastu Tips: ఇంట్లో ఈ మొక్కలు ఉన్నాయా.. ఆర్ధిక ఇబ్బందులతో పాటు కుటుంబంలో కలహాలు వచ్చే అవకాశం..
ఇంటి ప్రాంగణంలో మొక్కలను పెంచుకోవడానికి ఆసక్తిని చూపిస్తారు. అందం కోసం కొందరు మొక్కలను పెంచుకుంటే.. మరికొందరు ఆధ్యాత్మిక వాతావరణానని పెంపొందించుకోవడానికి మొక్కలను పెంచుకుంటారు. పువ్వులు, పండ్లు, పూజకు పనిచేసే మొక్కలు ఇలా రకరకాల మొక్కలను పెంచుకుంటారు. అందానికి అందం.. మంచి గాలి లభిస్తాయి ఈ మొక్కలతో.. అయితే ఇంట్లో పెంచుకునే మొక్కల విషయంలో వాస్తు శాస్త్రంలో కొన్ని నియమాలున్నాయని తెలుసా..
Updated on: Aug 28, 2023 | 12:39 PM

వాస్తు శాస్త్రంలో శక్తికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దీని ప్రకారం ఇంట్లో ఉంచిన ప్రతిదీ ఇంట్లో నివసించే సభ్యులపై సానుకూల లేదా ప్రతికూల ప్రభావం చూపుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని మొక్కలు, చెట్లను పెంచడం అశుభంగా పరిగణిస్తారు. వాస్తు ప్రకారం, వీటిని ఇంట్లో పెంచుకోవడం వలన ఇంట్లో పేదరికం వస్తుంది. దీని ప్రకారం ఇంట్లో కొన్ని మొక్కలు నాటడం మానుకోవాలి.

చింత చెట్టు - వాస్తు శాస్త్రంలో చింత చెట్టు చాలా అశుభకరంగా పరిగణిస్తారు. ఈ చెట్టు ఇంట్లో ప్రతికూలతను తెస్తుంది. ఈ చెట్టు ఇంటి ప్రాంగణంలో ఉంటె.. ఇంట్లో వాతావరణం భయంకరంగా ఉంటుందని నమ్ముతారు.

రావి మొక్క- వాస్తు శాస్త్రంలో రావి మొక్క ఇంట్లో ప్రతికూల శక్తిని తెస్తుంది. ఇంటి గోడలో లేదా ఏదైనా మూలలో రావి మొక్క పెరిగి ఉంటే, దానిని తొలగించండి.

కాక్టస్ మొక్కలు- ముళ్ల మొక్కలు ఇంటి లోపల ఎప్పుడూ పెంచుకోరాదు. ఇంట్లో ముళ్ల మొక్కలను పెంచుకోవడం వలన ఇంట్లోని వ్యక్తుల సంబంధాల్లో ద్వేషం తలెత్తుతుంది. కుటుంబ సభ్యుల మధ్య దూరం పెరగడం మొదలవుతుంది.

నిమ్మ మొక్క - ఇంట్లో నిమ్మకాయను ఉంచడం అశుభం. దీని వల్ల వాస్తు దోషాలు వస్తాయని నమ్ముతారు. దీన్ని ఇంట్లో నిమ్మ మొక్క పెంచుకోవడం వలన కుటుంబ సభ్యుల మధ్య టెన్షన్, ద్వేషం ఏర్పడుతుంది. మీరు ఇంట్లో నిమ్మ మొక్క పెంచుకుంటుంటే వెంటనే దానిని తొలగించండి.

ఎండిన మొక్కలు - ఇంట్లో ఎండిన మొక్కలు ఉంటే వాటిని తొలగించాలి. వాస్తు ప్రకారం, ఎండిన చెట్లు , మొక్కలు ఇంట్లో దుఃఖాన్ని తీసుకుని వస్తాయి. ప్రతికూలతను పెంచుతాయి.





























