హిమోగ్లోబిన్ స్థాయిలను సహజంగానే పెంచే టాప్ 10 ఫ్రూట్స్ ఇవే..
samatha
13 march 2025
Credit: Instagram
హిమోగ్లోబిన్ అనేది చాలా అవసరం. ముఖ్యంగా చాలా మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతుంటారు. అయితే అలాంటి వారు ఈ ఫ్రూట్స్ తినడం వలన ఆ సమస్య నుంచి బయటపడే ఛాన్స్ ఉంటుంది.
కరోనా తర్వాత చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. బలహీనత, అలసట, చిరాకు, ఫీవర్, రక్తహీనత వంటి అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. వీటి వలన వ్యక్తి రోగనిరోధక శక్తితగ్గిపోయి చాలా వీక్ అయిపోతారు.
దీంతో ఆసుపత్రికి వెళితే హిమోగ్లోబిన్ తక్కువగా ఉందంటూ బోలేడు మెడిసన్ ఇస్తుంటారు. అయితే అవి ఏవి లేకుండా సహజంగానే హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుకోవడానికి ఫోలిక్ ఆమ్లం అధికంగా ఉండే పండ్లు తినాలంట. అవి
దానిమ్మ పండు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్ సి, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందువలన దీనిని ప్రతి రోజు ఒక పండు తింటే హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయంట.
యాపిల్స్‌లో మితమైన ఇనుము స్థాయిలు ఉంటాయి. అందువలన ప్రతిరోజూ ఇది మీ డైట్‌లో చేర్చుకోవాలి, అలాగే అరటిపండు ఎర్రరక్తకణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. దీనిని తినడం ఆరోగ్యానికి చాలా మంచిదంట.
ఇనుము లేదా ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే పండ్లలో డేట్స్ ఒకటి, కర్జూర పండ్లను ప్రతి రోజూ తీసుకోవడం వలన హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి.
పుచ్చకాయలో అధిక నీటి శాతం ఉంటుంది. అలాగే విటమిన్ సి ఉంటుంది. ఇది తినడం వలన ఐరన్ లభిస్తుంది. అలాగే,ప్రతి రోజూ మీ డైట్‌లో జామకాయను చేర్చుకోవడం చాలా మంచిది.
విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే పండ్లలో బెర్రీలు, అత్తిపండ్లు, నారింజాలు ఒకటి. ఇవి శరీరంలో రక్తం ఏర్పడేలా చేస్తాయి. అందువలన ప్రతిరోజూ మీ డైట్‌లో వీటిని చేర్చుకోవాలి.