AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏ దేవతలకు ఏ పూలు సమర్పించడం అశుభకరమో తెలుసా?

హిందూ మతంలో ఆరాధలనలో పువ్వులు కీలక పాత్ర పోషిస్తుంటాయి.ప్రతి ఒక్కరూ నిత్యం దేవుడుని సమ్మరిస్తూ పూజలు చేస్తుంటారు. ఇక పూజ సమయంలో పూలు, దీపం, పసుపు, కుంకుమ, అగరబత్తులు ఇలాంటివి ఉండటం కామన్. ముఖ్యంగా ఎవ్వరు కూడా పూలు లేకుండా పూజ చేయరు. ప్రతి ఒక్కరూ మొదట దేవుడిని పూలతో అందంగా అలంకరించి, దీపారాధన చేస్తుంటారు.

Samatha J
|

Updated on: Nov 25, 2025 | 8:25 AM

Share
అయితే పూలు సమర్పించడం మంచిదే అయినప్పటికీ, హిందూ దేవతలలో కొందరికి కొన్ని పూలు సమర్పించడం అశుభకరం అంట. పురాణ కథల ప్రకారం, కొన్ని సార్లు పువ్వుల స్వభావం వలన అవి కొన్ని దేవతులకు సమర్పించ కూడదంట. కాగా, ఏ పూలు ఏ దేవుడికి సమర్పించడం మంచిది కాదో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
చాలా మంది ఇంటిలో ఎర్ర మందారం పూల చెట్టు తప్పనిసరిగా ఉంటాయి. అందుకే వీటిని చాలా మంది పూజలో తప్పకుండా ఉపయోగిస్తారు. కానీ కాళి మాత, లక్ష్మీ దేవి, గణేశుడికి ఈ పూలు ఉపయోగించడం మంచిదంట. వీటిని విష్ణు దేవుడికి, శివుడికి సమర్పించడం మంచిది కాదు అని చెబుతున్నారు పండితులు.

2 / 5
హిందూ మతంలో తులసి చెట్టుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. తులసి మాతను పూజిస్తూ, ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అంతే కాకుండా, చాలా పూజల్లో తులసి ఆకులను ఉపయోగిస్తారు. ఇక వీటి ఆకులు విష్ణు పూజకు చాలా ప్రసిద్ధి కానీ, వీటి పూలను ఎప్పుడూ కూడా విష్ణు పూజకు ఉపయోగించడం మంచిది కాదంట.

3 / 5
జిల్లేడు పూలు చాలా మందికి తెలుసు. ఇవి ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలలో కనిపిస్తాయి. వీటిని ఎక్కువగా పూజలకు ఉపయోగించరు, గ్రహదోషాల సమయంలో, రాహువు, కేతువు పూజలో, నిర్దిష్ట ఆచారాలను బట్టి ఉపయోగిస్తారు. అందువలన వీటిని ఎప్పుడూ ఇతర దేవతల పూజకు ఉపయోగించడం మంచిదికాదంట. ఇది అశుభం అవుతుందంట.

4 / 5
ఇక ప్రతి ఒక్కరూ నిత్యం శివారాధన చేస్తూ, శివ పూజ చేస్తుంటారు. అయితే ఎప్పుడూ కూడా శివుడి పూజలో కేతకి పూలు ఉపయోగించకూడదంట. కేతకి పరమేశ్వరుడికి వ్యతిరేకంగా అబద్ధం చెబుతుందని పురాణ కథ ఉంది. అందుకే శివయ్య పూజలో కేతకి పూలను నిషేధించారంట. అలాగే కృత్రిమ పూలు, ఎండిపోయిన, వాడిపోయిన పూలను పూజకు ఉపయోగించకూడదంట.

5 / 5