- Telugu News Photo Gallery Spiritual photos Telugu Astrology: Debilitated Planets Bring Raja Yoga and Wealth for 5 Zodiac Signs
Raja Yoga: రవి, శుక్రులకు నీచ స్థితి…ఈ రాశులకు రాజ యోగాలు పట్టబోతున్నాయ్..!
గ్రహ రాజు రవితో పాటు, రాజయోగకారక గ్రహమైన శుక్రుడు కూడా ప్రస్తుతం నీచ స్థితిలో ఉన్నారు. కన్యారాశిలో సంచారం చేస్తున్న శుక్రుడికి ఈ నెల (అక్టోబర్) 24 నుంచి నీచభంగం తొలగిపోయి పూర్తి స్థాయిలో నీచత్వం కలిగింది. ఇది నవంబర్ 2 వరకు కొనసాగుతుంది. ఇక రవి నవంబర్ 17 వరకు తులా రాశిలో నీచ స్థితిలో కొనసాగడం జరుగుతుంది. రెండు ప్రధాన గ్రహాలు నీచబడి నప్పటికీ కొన్ని రాశులకు మాత్రం ఇవి రాజయోగాలు కలిగిస్తాయి. మిథునం, సింహం, కన్య, ధనుస్సు, మకర రాశుల వారి జీవితాల్లో సుమారు పది రోజుల పాటు శుభ ఫలితాలే ఎక్కువగా కలిగే అవకాశం ఉంది.
Updated on: Oct 21, 2025 | 11:41 AM

మిథునం: ఈ రాశికి చతుర్థ స్థానంలో శుక్రుడు, పంచమ స్థానంలో రవి నీచబడడం వల్ల తప్పకుండా రాజ యోగాలు, ధన యోగాలు కలుగుతాయి. ఉద్యోగంలో సమర్థతకు గుర్తింపుగా పద్నోతులు లభించడం, జీతభత్యాలు పెరగడం, ఊహించని ప్రాధాన్యం లభించడం వంటివి జరుగుతాయి. ప్రేమ ప్రయత్నాలు, పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా విజయవంతం అవుతాయి. వివాహితులకు సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.

సింహం: ఈ రాశికి ధన స్థానంలో శుక్రుడు, తృతీయ స్థానంలో రాశ్యధిపతి రవి నీచబడడం వల్ల ఉద్యోగంలో తప్పకుండా హోదా, జీతభత్యాలు పెరగడానికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా ఇతర దేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. కుటుంబంలో సమస్యలన్నీ పరిష్కారమై, సుఖ సంతోషాలు బాగా వృద్ధి చెందడం జరుగుతుంది.

కన్య: ఈ రాశిలో శుక్రుడు, ధన స్థానంలో రవి నీచబడడం వల్ల ఆదాయం పెరిగి, ఖర్చులు బాగా తగ్గు తాయి. వైద్య ఖర్చులు కూడా బాగా తగ్గే అవకాశం ఉంది. ఆదాయాన్ని ఎక్కడ ఏ విధంగా మదుపు చేసినా అంచనాలకు మించిన లాభాలు కలుగుతాయి. రావలసిన డబ్బు, రాదనుకున్న సొమ్ము, బాకీలు, బకాయిలన్నీ కొద్ది ప్రయత్నంతో వసూలవుతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.

ధనుస్సు: ఈ రాశికి దశమ స్థానంలో శుక్రుడు, లాభ స్థానంలో రవి నీచబడడం వల్ల ఉద్యోగంలో హోదా పెరిగి పని ఒత్తిడి చాలావరకు తగ్గిపోతుంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు అనేక ఆఫర్లు, అవకాశాలు అందుతాయి. ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు వృధ్ధి చెందుతాయి. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఆరోగ్యం మెరుగవుతుంది.

మకరం: ఈ రాశికి భాగ్య స్థానంలో శుక్రుడు, దశమ స్థానంలో రవి నీచబడడం వల్ల ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో సీనియర్లను కాదని అందలాలు ఎక్కుతారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. పిత్రార్జితం లభించడంతో పాటు ఆస్తిపాస్తులు లభిస్తాయి.



