- Telugu News Photo Gallery Spiritual photos Sravana Masam 2025 These zodiac signs to have Shubh Yogas Details in Telugu
Sravana Masam Horoscope: శ్రావణ మాసంలో ఈ రాశుల వారికి శుభ యోగాలే..!
మొత్తం 12 మాసాల్లోనూ శ్రావణ మాసం అత్యంత శుభప్రదమైంది. ఏ పూజ చేసినా, ఏ పరిహారం చేసినా రెట్టింపు శుభ ఫలితాలనిస్తుంది. ఈ నెల 26 నుంచి శుక్రుడు మిథున రాశిలో గురువుతో నెల రోజులు కలిసి ఉండడం వల్ల తప్పకుండా ప్రతి రాశివారికీ ఏదో ఒక విధమైన అదృష్టం పడుతుంది. పూజ లేదా పరిహారం చేయడాన్ని మాత్రం విస్మరించకూడదు. వాస్తవానికి ఈ శ్రావణ మాసంలో కొన్ని రాశులకు ఈ రెండు శుభ గ్రహాలు దుస్థానాల్లో ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా మేషం, కర్కాటకం, వృశ్చికం, మకరం, మీన రాశులకు ఈ గురు, శుక్రుల స్థితి అంతగా యోగించే అవకాశం లేదు. అయితే, కొద్దిపాటి పరిహారంతో ఈ రాశులకు కూడా శుభాలు కలుగుతాయి.
Updated on: Jul 24, 2025 | 7:32 PM

మేషం: ఏ రాశికైనా తృతీయ స్థానం అత్యంత బలహీనమైన రాశి. ఈ రాశిలో గురు, శుక్రుల సంచారం వల్ల ఈ రాశివారికి ఆత్మవిశ్వాసం తగ్గడం, ప్రయత్న లోపం, అనారోగ్య సమస్యలు పీడించడం, ఆదా యం తగ్గడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అయితే, దుర్గామాతకు పూజ చేయడం లేదా లలితా సహస్ర నామ స్తోత్ర పఠనంగానీ చేయడం వల్ల ఈ నెలంతా నల్లేరు కాయల మీద బండిలా సాగిపోయే అవకాశం ఉంది. సమస్యలు తగ్గడంతో పాటు మనసులోని కోరికలు నెరవేరుతాయి.

కర్కాటకం: ఈ రాశికి వ్యయ స్థానంలో గురు, శుక్రుల సంచారం వల్ల శ్రావణ మాసమంతా ఖర్చులు, సమస్యలు, శ్రమ, తిప్పట, అనారోగ్యాలతో గడిచిపోయే అవకాశం ఉంది. వీటి నుంచి బయట పడాలన్న పక్షంలో శివార్చన చేయడం చాలా మంచిది. దీనివల్ల వృత్తి, ఉద్యోగాలతో పాటు కుటుంబంలో కూడా సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. ఉపయోగ ఖర్చులు, లాభదాయక పెట్టుబడులు పెరుగుతాయి. ఆశించిన పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. తరచూ దుర్గాదేవిని పూజించడం మంచిది.

వృశ్చికం: ఈ రాశికి అష్టమ స్థానంలో ఈ రెండు శుభ గ్రహాల సంచారం ఈ రాశివారికి ఏ విధంగానూ మేలు చేసే అవకాశం ఉండదు. ధన నష్టం ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. శ్రమకు తగ్గ ఫలితం లభించకపోవచ్చు. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు ఒకపట్టాన ఆశించిన ఫలితాలనివ్వవు. కుటుంబంలో సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంది. ఈ సమస్యలకు పరిహారంగా తరచూ ఆదిత్య హృదయం చదువుకోవడం మంచిది. సమస్యల పరిష్కారంతో పాటు ధన యోగాలు కలుగుతాయి.

మకరం: ఈ రాశికి షష్ట స్థానంలో గురు, శుక్రుల సంచారం వల్ల శ్రావణ మాసమంతా ఆర్థిక సమస్యలు, అనారోగ్యాలు, పోటీదార్ల బెడద, ధన నష్టం వంటి ఇబ్బందులతో గడిచిపోయే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో కూడా ప్రాభవం తగ్గే అవకాశం ఉంది. అయితే, ఈ రాశివారు తరచూ శివార్చన చేయడం లేదా గణపతిని అర్చించడం వల్ల ఆదాయం పెరిగి వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కువగా పుణ్యక్షేత్రాలను, గుడులను సందర్శించే అవకాశం ఉంది.

మీనం: ఈ రాశివారికి చతుర్థ స్థానంలో శుక్ర, గురులు కలవడం వల్ల కుటుంబ, వ్యక్తిగత సమస్యల వల్ల మనశ్శాంతి తగ్గుతుంది. విపరీతమైన మానసిక ఒత్తిడి ఉంటుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు తగ్గుతాయి. ఉద్యోగంలో పని భారం ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యలతో శ్రావణ మాసం వృథా కాకుండా ఉండాలన్న పక్షంలో ఈ రాశివారు తరచూ పార్వతీ పరమేశ్వరులను స్తుతించడం చాలా మంచిది. ఈ సమస్యల నుంచి బయటపడడంతో పాటు, ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది.



