- Telugu News Photo Gallery Spiritual photos Somvati amavasya 2022 : do these work to get rid of pitra dosh on somvati amavasya in telugu
Somvati Amavasya 2022: రేపు సోమవతి అమావస్య.. 30ఏళ్ల తర్వాత విశిష్ట తిథి.. పితృ దోషాన్ని తొలగించుకోవడానికి ఏం చేయాలంటే
Somati Amavasya 2022: ఈసారి మే 30న రానున్న అమావస్యను సోమవతి అమావస్య అని పిలుస్తారు. అయితే ఇప్పుడు ఏర్పడనున్న అమావస్యకు విశిష్టత నెలకొంది. 30 సంవత్సరాల తర్వాత ఏర్పడనున్న అద్భుతమైన రోజని అంటున్నారు. ఈ రోజున పితృ దోషం నుండి బయటపడటానికి కొన్ని చర్యలు తీసుకోవడం వలన అద్భుత ఫలితాలు పొందవచ్చు అని పెద్దల ఉవాచ
Updated on: May 29, 2022 | 1:43 PM

ఈసారి జ్యేష్ఠ మాసం కృష్ణ పక్ష అమావస్య మే 30వ తేదీన వస్తోంది. ఈ అమావస్య సోమవారం రానున్నది కనుక సోమవతి అమావస్య అని కూడా అంటారు. ఈసారి మే 30న సావిత్రి వ్రతం కూడా నిర్వహించనున్నారు. ఈ రోజున శని జయంతి కూడా జరుపుకుంటారు. 30 ఏళ్ల వస్తున్న ఈ అమావస్య రోజున పూజలు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ రోజున పితృ దోషం నుండి బయటపడటానికి మీరు కొన్ని చర్యలు తీసుకోవచ్చు.

అమావాస్య నాడు బ్రహ్మ ముహూర్తంలో లేవండి. స్నానంచేసి శుభ్రమైన బట్టలు ధరించండి. పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి, ఈ రోజున పిండ ప్రధాని చేయండి. ఇలా చేయడం వల్ల పిత్ర దోషం నుండి విముక్తి లభిస్తుంది.

ఈ రోజున పేదవారికి, బ్రాహ్మణులకు ఆహారం అందించండి. మీ సామర్థ్యానికి తగినట్లు బ్రాహ్మణులకు దక్షిణ ఇవ్వాల్సి ఉంది. ఈ రోజున స్వయంగా వండిన ఆహారంతో దానం చేయండి.

పితృ దోషం పోవాలంటే ఆవును దానం చేయండి. ఇలా చేయడం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. వేసవి కాలంలో, బాటసారుల కోసం వివిధ ప్రదేశాలలో మంచి నీటిని ఏర్పాటు చేయండి.

అమావాస్య రోజున మర్రి చెట్టును పూజించాల్సి ఉంది. మర్రిచెట్టులో బ్రహ్మ, విష్ణు,మహేశ్వరుల సహా ముక్కోటి దేవతలు నివసిస్తారని ప్రతీతి. కనుక రేపు మర్రి చెట్టుని పూజించడం వల్ల పితృ దోషం నుండి విముక్తి లభిస్తుంది.

(ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)




