- Telugu News Photo Gallery Spiritual photos Feng Shui Tips in Telugu: know the benefits of wind chime at home according to Feng Shui
Feng Shui Tips: ఇంటిని విండ్ చైమ్‌లతో అలంకరించాలనుకుంటున్నారా.. అయితే ఈ టిప్స్ పాటించండి..
Feng Shui Tips: విండ్ చైమ్(గాలి గంటలు)లను సాధారణంగా ఇంటి అలంకరణకు ఉపయోగిస్తారు. ఫెంగ్ షుయ్ లో విండ్ చైమ్ చాలా ముఖ్యమైనది. వీటి ధ్వని ప్రతికూలతను తొలగిస్తుందని.. సానుకూల శక్తి ప్రసారం చేయబడుతుందని నమ్ముతారు.
Updated on: May 28, 2022 | 2:52 PM

విండ్ చైమ్‌లు వివిధ రకాల గంటలతో తయారు చేస్తారు. ఇవి అనేక రకాలలో అందంగా ఉంటాయి. మార్కెట్‌లో లభ్యమవుతాయి. ఫెంగ్ షుయ్లో విండ్ చైమ్ చాలా ముఖ్యమైనది. వీటిని ఇంట్లో పెట్టుకోవడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈరోజు ఆ ప్రయోజనాలను తెలుసుకుందాం.

ఇంట్లో విండ్ చైమ్ అప్లై చేయడం వల్ల ప్రతికూలత తొలగిపోతుంది. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ప్రసరిస్తుంది. దీన్ని ఇంట్లో పెట్టుకుంటే వాస్తు దోషాలు తొలగిపోతాయి.

ఇంటికి పశ్చిమ లేదా వాయువ్య దిశలో ఈ విండ్ చైమ్ ఉంచడం శ్రేయస్కరం. ఈ దిశలో మెటల్ తో తయారు చేసిన గాలి చైమ్లను ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. అదే ఆగ్నేయ లేదా దక్షిణ దిశలో వెదురు లేదా కలపతో చేసిన విండ్ చైమ్‌లను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.

ఇంట్లో విండ్ చైమ్ లను ఇంట్లో అలంకరించడం వల్ల సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలను మరింత మెరుగయ్యేలా చేస్తుంది. ఇంట్లో ఆనందం, శాంతి, సంపద వస్తాయి. ఇది అదృష్టాన్ని తెస్తుంది.

ఇంటి ప్రధాన ద్వారం, మధ్య ద్వారం లేదా కిటికీలకు విండ్ చైమ్‌లు వేలాడదీయడం ఇంటికి అందంతో పాటు.. సుఖ సంతోషాలను కూడా తెస్తాయి. ఇవి ఇంటి అందాన్ని పెంచడమే కాకుండా మనశ్శాంతిని కూడా అందిస్తాయి.

(ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)




