AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వృశ్చిక రాశిలోకి శుక్రుడు.. ఆ రాశుల వారికి సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు!

Shukra Gochar 2025: జ్యోతిషశాస్త్రంలో గురువు తర్వాత అత్యంత ప్రాధాన్యం ఉన్న గ్రహం శుక్ర గ్రహం. జీవితం సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో సాగిపోవడానికి శుక్రుడి అనుకూలత చాలా అవసరం. ఇంత వరకూ స్వక్షేత్రమైన తులా రాశిలో సంచారం చేస్తున్న శుక్రుడు ఈ నెల(నవంబర్) 26న వృశ్చిక రాశిలో ప్రవేశించి డిసెంబర్ 20 వరకూ అదే రాశిలో కొనసాగడం జరుగుతుంది. వృశ్చిక రాశి శుక్రుడికి అనుకూల రాశి కానప్పటికీ కొన్ని రాశులకు వస్తు సంపదలనిచ్చే అవకాశం ఉంది. వృషభం, కర్కాటకం, సింహం, తుల, మకరం, కుంభ రాశులకు యోగదాయకంగా మారడం జరుగుతుంది.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 19, 2025 | 5:15 PM

Share
వృషభం: రాశ్యధిపతి శుక్రుడు సప్తమ స్థానంలో ప్రవేశించడం వల్ల సంపన్న కుటుంబంతో పెళ్లి కావడం గానీ, ప్రేమలో పడడం గానీ జరుగుతుంది. జీవిత భాగస్వామితో కొద్దిపాటి సమస్యలు తలెత్తే అవ కాశం ఉంది. దాంపత్య జీవితం కొద్దిగా ఇబ్బందుల్లో పడడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. భాగస్వాములతో సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో అధికార యోగం పట్టే అవకాశం ఉంది. బాగా దూర ప్రాంతానికి బదిలీ అయ్యే సూచనలున్నాయి.

1 / 6
కర్కాటకం: ఈ రాశికి పంచమ స్థానంలో శుక్ర సంచారం వల్ల మనసులోని కోరికలు, ఆశలు చాలావరకు నెరవేరుతాయి. ప్రేమ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో సమర్థతకు, ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. నైపుణ్యాలు వృద్ధి చెందుతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు కొద్ది మార్పులతో లాభాల బాటపడతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది.

2 / 6
సింహం: ఈ రాశికి చతుర్థ స్థానంలో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో సుఖ సంతోషాలు బాగా వృద్ధి చెందుతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. కొద్ది ప్రయత్నంతో గృహ, వాహన యోగాలు కలుగుతాయి. ఉద్యోగంలో హోదా, జీతభత్యాలు పెరుగుతాయి. సామాజికంగా కూడా హోదా, స్థాయి లభించే అవకాశం ఉంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. తల్లి వైపు నుంచి ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. సొంత ఊర్లోనే ఉన్న వ్యక్తితో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.

3 / 6
తుల: రాశ్యధిపతి శుక్రుడు ధన స్థానంలో సంచారం ప్రారంభించడం వల్ల ఆదాయానికి లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది. ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఉంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. రావలసిన సొమ్ము వసూలవుతుంది. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. పలుకుబడి పెరుగుతుంది. విలాస జీవితం అలవడుతుంది. ఉద్యోగంలో మీ సలహాలు, సూచనల వల్ల అధికారులు లబ్ధి పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది.

4 / 6
మకరం: ఈ రాశికి లాభ స్థానంలో శుక్ర సంచారం వల్ల ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. బాకీలు, బకాయిలు కూడా వసూలవుతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వంటి ఆదాయ ప్రయత్నాలన్నీ బాగా లాభిస్తాయి. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగంలో పదోన్నతికి, జీతభత్యాల పెరుగుదలకు అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది.

5 / 6
కుంభం: ఈ రాశికి దశమ స్థానంలో శుక్ర సంచారం వల్ల ఉద్యోగంలో పదోన్నతికి బాగా అవకాశం ఉంది. పని భారం, పని ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు గడిస్తారు. వృత్తి, ఉద్యోగాలరీత్యా ఇతర దేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభిస్తుంది. సహోద్యోగితో పెళ్లి నిశ్చయం అవుతుంది. ఆస్తి లాభం కలుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. రాజపూజ్యాలు కలుగుతాయి.

6 / 6