- Telugu News Photo Gallery Spiritual photos September Planetary Shifts: These are lucky zodiac signs details in Telugu
Telugu Astrology: చంద్ర గ్రహణం తర్వాత.. ఈ రాశుల వారికి అధికార, ధన యోగాలు..!
సెప్టెంబర్ 7న వచ్చే సంపూర్ణ చంద్ర గ్రహణం తర్వాత, అంటే సెప్టెంబర్ 10వ తేదీ నుంచి వరుసగా నాలుగు గ్రహాలు రాశులు మారుతున్నందువల్ల మేషం, వృషభం, తుల, ధనుస్సు, మకరం, మీన రాశుల వారి జీవితాలు కొత్త పుంతలు తొక్కే అవకాశం ఉంది. రవి, బుధ, కుజ, శుక్రుల రాశి మార్పు వల్ల ఈ రాశుల వారి జీవితాలు నెల రోజుల పాటు కీలక మలుపులు తిరగడం జరుగుతుంది. ప్రస్తుతం ఆరు రాశులకు గ్రహాలన్నీ చాలావరకు అనుకూలంగా ఉన్నాయి. అధికార యోగం, ధన యోగం, విదేశీయానం, ఉద్యోగం, పెళ్లి, ప్రేమల్లో వీరికి ఇది కలిసి వచ్చే కాలంగా కనిపిస్తోంది.
Updated on: Sep 02, 2025 | 7:26 PM

మేషం: ఈ రాశివారికి రాశ్యధిపతి కుజుడు సప్తమ స్థానంలో ప్రవేశించిన దగ్గర నుంచి జీవితం సానుకూలంగా మారడం ప్రారంభమవుతుంది. ఇతర గ్రహాలు కూడా అనుకూలంగా మారడం వల్ల వీరి జీవితం ఆడింది ఆటగా పాడింది పాటుగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాలతో పాటు ఆర్థికంగా కూడా బాగా కలిసి వచ్చే అకాశం ఉంది. అనేక విధాలుగా సంపద పెరుగుతుంది. ఆస్తి, లాభం, భూలాభం కలుగుతాయి. సంతాన యోగం కలుగుతుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి.

వృషభం: ఈ రాశివారికి రాశ్యధిపతి శుక్రుడి బలం పెరగడంతో పాటు కుజ, బుధ, రవుల అనుకూలత కూడా వృద్ధి చెందడం వల్ల ఉద్యోగంలో అందలాలు ఎక్కడానికి, మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. అనేక విధాలుగా ఆర్థిక లాభం కలిగే అవకాశం ఉంది. రావలసిన డబ్బు అందడంతో పాటు ఆస్తి కలిసి వచ్చే సూచనలున్నాయి. ప్రాభవం, ప్రాధాన్యం బాగా పెరుగుతాయి.

తుల: ఈ రాశివారికి రాశ్యధిపతి శుక్రుడు దశమ, లాభ స్థానాల్లో సంచారం చేయడంతో పాటు రవి, కుజ, బుధ గ్రహాల అనుకూలత పెరగడం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది. ఆదాయం బాగా వృద్ది చెందుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. సంపన్నులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ప్రేమ ప్రయత్నాలు సఫలం అవుతాయి.

ధనుస్సు: ఈ రాశివారికి గురు బలం పెరగడంతో పాటు నాలుగు గ్రహాలు అనుకూలంగా మారుతున్నందు వల్ల మహా భాగ్య యోగం పట్టే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతికి, జీతభత్యాలు బాగా పెరగడానికి అవకాశం ఉంది. ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా పరిష్కారం అవుతుంది. తల్లితండ్రుల నుంచి సంపద పెరిగే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి లాభాల పంట పండిస్తాయి. పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి.

మకరం: ఈ రాశివారికి రాశ్యధిపతి శనితో పాటు నాలుగు గ్రహాల శుభ సంచారం వల్ల ఆకస్మిక ధన లాభానికి, ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరగడానికి బాగా అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో కూడా రాబడి అంచనాలను మించుతుంది. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. అనేక విధాలుగా ఆర్థిక లాభాలు పొందుతారు. నిరుద్యోగులకు భారీ జీతభత్యాలతో ఉద్యోగం లభిస్తుంది. సంపన్నులతో పెళ్లి సంబంధం కుదురుతుంది.

మీనం: ఈ రాశివారికి రాశ్యధిపతి గురువుతో పాటు నాలుగు గ్రహాలు అనుకూలంగా మారడం వల్ల ఏలిన్నాటి శని ప్రభావం కూడా బాగా తగ్గిపోతుంది. ఊహించని ధన యోగాలు పడతాయి. ఉద్యోగం, కుటుంబం, ఆదాయపరంగా జీవితం సానుకూల మలుపులు తిరుగుతుంది. ఆర్థిక పరిస్థితి, జీవన శైలి పూర్తిగా మారిపోతాయి. సిరిసంపదలు బాగా వృద్ది చెందుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులు లభిస్తాయి. రావలసిన సొమ్ము అందుతుంది. విదేశీ సొమ్ము అనుభవించే యోగం పడుతుంది.



