- Telugu News Photo Gallery Spiritual photos October 2021 festival calendar: Shardiya Navratri to Durga Puja, Dussehra to Karwa Chauth dates and details
October 2021 Festival Calendar: అక్టోబర్ నెలలో వచ్చే ప్రముఖ హిందూ పండగ తేదీలు.. విశిష్టత
October 2021 Festival Calendar: అక్టోబర్ నెల పదో నెల. హిందూ క్యాలెండర్ ప్రకారం హిందువుల పండగలు ప్రతి నెలా వస్తూనే ఉంటాయి. ఈ అక్టోబర్ నెలలో శరన్నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఆశ్వియుజ మాసం అక్టోబర్ నెలలో.. ఇందిరా ఏకాదశి, నవరాత్రి, దసరా, కర్వా చౌత్‌తో ఇంకా ఏయే ముఖ్యమైన పండుగలు ఏ ఏయే తేదీల్లో వచ్ఛాయో ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Sep 30, 2021 | 1:58 PM

Photo 1

హిందూ క్యాలెండర్ లో ప్రతి నెలా శుక్ల, కృష్ణ పక్షాల్లో రెండు ఏకాదశులు వస్తాయి. అక్టోబర్ మూడో తేదీన ఇందిరా ఏకాదశి వచ్చింది. ఈరోజున విష్ణుమూర్తి భక్తులు ఉపవశం ఉంది.. శ్రీమహావిష్ణువుని కొలుస్తారు.

నెలనెలా వచ్చే మాస శివరాత్రి అక్టోబర్ నాలుగో తేదీ వచ్చింది. సోమవారం మాస శివరాత్రి రావడంతో విశిష్టను సంతరించుకుంది. దీంతో సోమవారం నాడు శివ భక్తులు ప్రదోష వ్రతం ఆచరిస్తారు. శివపార్వతులను పూజిస్తారు.

అక్టోబర్ నెల ఆరో తేదీన మహాలయ అమావాస్య వచ్చింది. ఈరోజున పితృ పక్షాలకు శ్రద్ధ కర్మలు నిర్వహిస్తారు.

అక్టోబర్ ఏడో తేదీ నుంచి దేశ వ్యాప్తంగా శరన్నవరాత్రులు ప్రారంభమవుతాయి. తొలిరోజు ఘట స్థాపన లేదా కలశ స్థాపన జరుగుతుంది. ఈరోజు నుండే అమ్మవారిని తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రూపాల్లో కొలుస్తారు. ఈసారి నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ 07 న ప్రారంభమై 15వ తేదీన దసరాతో ముగుస్తాయి.

అక్టోబర్ 15న దసరా పండుగ వచ్చింది. చెడుపై మంచి సాధించిన విజయంగా గుర్తుగా విజయదశమిని జరుపుకుంటారు. విజయదశమిని దసరా అని కూడా అంటారు.

అక్టోబర్ 24వ తేదీన హిందూ సంప్రదాయం ప్రకారం మహిళలు కార్వా చౌత్ పండగను జరుపుకుంటారు, ఈరోజున మహిళలు చేసే ఉపవాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే ఈ పండుగను ఎక్కువగా ఉత్తర భారతంలో జరుపుకుంటారు ఈరోజున వివాహమైన స్త్రీలు కొత్త బట్టలు ధరించి, నిర్జల ఉపవాసం పాటించి తమ భర్తలు దీర్ఘాయువు కోసం అమ్మవారిని పూజిస్తారు.





























