Success Astrology: చంద్ర, రాహువుల యుతి.. కొత్త ప్రయత్నాల్లో ఆ రాశులకు విజయం తథ్యం..!
ఈ నెల(నవంబర్) 27, 28, 29 తేదీల్లో కుంభ రాశిలో చంద్ర, రాహువుల యుతి జరుగుతోంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ రెండు గ్రహాలు కలిసినప్పుడు సాధారణంగా ప్రతి రాశివారు కొత్త అవకాశాల కోసం ప్రయత్నిస్తుంటారు. ఈ విషయంలో మేషం, వృషభం, మిథునం, తుల, వృశ్చికం, మకర రాశుల వారు తప్పకుండా విజయం సాధించే అవకాశం ఉంది. జీవితంలో ఆశించిన పురోగతి లభిస్తున్నా వీరికి సంతృప్తి ఉండకపోవచ్చు. ఈ రాశుల వారు కొత్త అవకాశాల కోసం అవిశ్రాంతంగా ప్రయత్నించడం జరుగుతుంది. ఈ మూడు రోజుల్లో చేసే ప్రయత్నాలు ఏవైనప్పటికీ అవి ఈ మూడు రోజుల్లో గానీ, సమీప భవిష్యత్తులో గానీ తప్పకుండా ఫలిస్తాయి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6