- Telugu News Photo Gallery Spiritual photos Madhur madhanantheshwara temple history and timings in kerala
ఈ గుడిలోని గణపతి విగ్రహం రోజురోజూకీ పెరుగుతుంది.. గోడపై వెలసిన వినాయకుడి ఆలయం ఎక్కడుందో తెలుసా..
విఘ్నాలకు అధిపతి వినాయకుడు. పార్వతీ తనయుడు గణపతిని పూజించిన తర్వాతే ఏ కార్యక్రమాలైన ప్రారంభిస్తాం. ఏకదంతుడు.. విఘ్నేశ్వరునికి మన దేశంలో అనేక ఆలయాలు ఉన్నాయి. అందులో ఒకటి బొడ్డా గణేశా ఆలయం..
Updated on: May 04, 2021 | 8:08 PM

కేరళలోని కాసర్ గోడ్ జిల్లాలోని మధూరులో ఉన్న గణపతి ఆలయానికి ప్రత్యేకత ఉంది. మధురవాహిని నదీ తీరంలో, ప్రకృతి రమణీయత మధ్య గణపయ్య కోలువై ఉన్నాడు.

ఈ క్షేత్రంలోని స్వామిని మదరాంతేశ్వర స్వామిగా పూజలందుకుంటున్నారు. స్థల పురాణం ప్రకారం ఒక మహిళ స్వామి విగ్రహాన్ని కనుగొంది. అందుకే స్వామివారిని ఉద్భవ మూర్తిగా పేర్కోంటారు.

ఆ విఘ్నేశ్వరుడు మొదటిసారిగా మహిళా భక్తురాలికి దర్శనమిచ్చారు. అందుకే ఆమె పేరు మీద మధూరు ఆలయంగా ప్రసిద్ధి చెందింది.

ఇక్కడ స్వామివారు గర్భగుడి వెలుపల దక్షిణ భాగం గోడపై వినాయకుడి విగ్రహం ఉంటుంది. రోజురోజుకూ స్వామివారు పెరుగుతుంటారు. అందుకే బొడ్డ గణేశా అని పిలుస్తుంటారు.

టిప్పు సుల్తాన్ సేనలు ఈ ఆలయాన్ని ద్వంసం చేయడానికి వచ్చాయి. అయితే ఇక్కడి ఆలయ ప్రాంగణంలోని బావిలోని నీటిని టిప్పు సుల్తాన్ తాగిన తర్వాత మనస్సు మారి దాడిని విరమించుకొని వెనక్కు వెళ్ళాడట.

ఈ ఆలయాన్ని ఏనుగు ఆకారంలో నిర్మించారు. మూడు అంతస్తులుగా ఉండే ఆలయం సందర్శకులకు దివ్యానుభూతిని కలిగిస్తుంది. ఇక్కడ అప్పాన్ని ప్రసాదంగా ఇస్తారు. ఇక్కడి గణపతికి ఉదయాస్తమాన సేవ నిర్వహిస్తారు.

సహస్ర అప్ప పూజలో భాగంగా వెయ్యి అప్పాలతో పూజలు జరిపిస్తారు. మూడప్పమ్ సేవ కూడా నిర్వహిస్తారు. కాసర్ గోడ్ నుంచి 7 కి.మీ దూరంలో ఈ ఆలయం ఉంది.

మదరాంతేశ్వర స్వామి




