- Telugu News Photo Gallery Spiritual photos Guru's Auspicious Gaze: These zodiac signs to have positive impact details in Telugu
Lucky Signs: గురు దృష్టితో అన్ని శుభాలే.. ఈ రాశులకు ఊహించని రాజపూజ్యాలు..!
Jupiter Impact: ప్రస్తుతం గురు దృష్టితో రెండు పాప గ్రహాలు - కుజ, రాహువులు - శుభ గ్రహాలుగా మారిపోవడం జరిగింది. అక్టోబర్ 28 వరకు తులా రాశి సంచారం చేస్తున్న కుజుడి మీద, వచ్చే ఏడాది డిసెంబర్ వరకు కుంభ రాశిలో సంచారం చేస్తున్న రాహువు మీద మిథున రాశి నుంచి గురువు దృష్టి పడడం వల్ల ఈ రెండు గ్రహాలు కొన్ని రాశులకు శుభ ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. మేషం, మిథునం, సింహం, తుల, ధనుస్సు, మకరం, కుంభ రాశులు ఈ దృష్టి వల్ల అనేక విధాలుగా ఉన్నత స్థితికి చేరుకోవడం, రాజపూజ్యాలు వృద్ధి చెందడం, సంతాన యోగం కలగడం వంటివి జరుగుతాయి.
Updated on: Sep 19, 2025 | 7:23 PM

మేషం: ఈ రాశికి లాభ స్థానంలో ఉన్న రాహువును, సప్తమ స్థానంలో ఉన్న రాశ్యధిపతి కుజుడిని గురువు వీక్షించడం వల్ల ప్రతికూల ఫలితాలకన్నా సానుకూల ఫలితాలు బాగా పెరుగుతాయి. ఈ రాశికి చెందిన ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతులతో పాటు గృహ, వాహన యోగాలు కలుగుతాయి. అనేక విధాలుగా బ్యాంక్ బ్యాలెన్స్ వృద్ధి చెందుతుంది. తప్పకుండా సంతాన యోగం కలుగుతుంది. ఉన్నత స్థాయి పెళ్లి సంబంధం కుదురుతుంది.

మిథునం: పంచమ స్థానంలో ఉన్న కుజుడిని, భాగ్య స్థానంలో ఉన్న రాహువును ఈ రాశి నుంచి గురువు వీక్షించడం వల్ల విదేశీయానానికి, విదేశీ అవకాశాలకు మార్గం సుగమం అవుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగులకు ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. ఇంట్లో పెళ్లి, గృహ ప్రవేశం వంటివి జరుగుతాయి. ఎటువంటి ప్రయత్నం చేపట్టినా విజయవంతం అవుతుంది. అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది.

సింహం: ఈ రాశికి తృతీయ స్థానంలో ఉన్న కుజుడిని, సప్తమ స్థానంలో ఉన్న రాహువును లాభ స్థానం నుంచి గురువు చూడడం వల్ల ఈ రాశివారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏ ప్రయత్నం తల పెట్టినా విజయం సిద్ధిస్తుంది. ఆదాయ ప్రయత్నాలు రెట్టింపు ఫలితాలనిస్తాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో అరుదైన శుభవార్తలు వింటారు. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది.

తుల: ఈ రాశిలో ఉన్న కుజుడిని, పంచమస్థానంలో ఉన్న రాహువును భాగ్య స్థానం నుంచి గురువు వీక్షించడం వల్ల ఈ రాశివారికి రాజపూజ్యాలు ఎక్కువగా కలుగుతాయి. వీరు అనేక విధాలుగా విజయాలు, సాఫల్యాలు సాధించే అవకాశం ఉంది. సంతాన యోగం కలుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఆదాయ వృద్ధికి ఏ మార్గాన్ని అనుసరించినా నూరు శాతం ఫలితాలనిస్తుంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు ఉండకపోవచ్చు.

ధనుస్సు: తృతీయ స్థానంలో ఉన్న రాహువును, లాభ స్థానంలో ఉన్న కుజుడిని రాశ్యదిపతి గురువు ఏడవ స్థానం నుంచి వీక్షించడం వల్ల ఈ రాశివారికి సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. రాజ పూజ్యాలు కలుగుతాయి. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు వృద్ధి చెందుతాయి. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతుంది. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. కుటుంబంలో శుభ కార్యాలు జరుగుతాయి. ఉద్యోగంలో హోదాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగి పోతాయి.

మకరం: ఈ రాశికి ధన స్థానంలో ఉన్న రాహువును, దశమ స్థానంలో ఉన్న కుజుడిని గురువు చూడడం వల్ల ఉద్యోగంలో పదోన్నతులతో పాటు, జీతభత్యాలు అంచనాలను మించి పెరుగుతాయి. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. ప్రభుత్వం నుంచి గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. కుటుంబంలో పెళ్లి, గృహ ప్రవేశం వంటి శుభకార్యాలు జరుగుతాయి.

కుంభం: ఈ రాశిలో ఉన్న రాహువును, భాగ్య స్థానంలో ఉన్న కుజుడిని ధనాధిపతి గురువు చూడడం వల్ల ఈ రాశివారికి ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. కుటుంబంలో శుభ కార్యాలు జరుగుతాయి. సొంత ఇంటి కల నెరవేరుతుంది. విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న కల కూడా నెరవేరవచ్చు. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలో డిమాండ్ వృద్ధి చెందుతుంది. ఉన్నత కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది.



