- Telugu News Photo Gallery Spiritual photos August 2025 Lucky Zodiac Signs: These are lucky zodiacs in aug month details in Telugu
Lucky Zodiac Signs: కీలక గ్రహాల అనుకూలత.. ఆగస్టులో ఈ రాశుల వారే అదృష్టవంతులు!
August 2025 Lucky Zodiac Signs: ఆగస్టు 16న రవి తన స్వక్షేత్రమైన సింహ రాశిలో ప్రవేశించి అదే రాశిలో నెల రోజుల పాటు కొన సాగడం జరుగుతుంది. మిథున రాశిలో ఆగస్టు 21న శుక్రుడు కర్కాటక రాశిలో ప్రవేశించబోతున్నాడు. ఈ రకమైన గ్రహ సంచారం వల్ల మేషం, వృషభం, మిథునం, సింహం, తుల, మకర రాశుల వారు బాగా అదృష్టవంతులయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అంచనాలకు మించిన పురోగతి, ఆదాయ వృద్ధి, సమస్యల పరిష్కారం, విదేశీయానం వంటి యోగాలు పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఎక్కువ రోజులు మిథునంలో శుక్ర, గురువుల యుతి కొనసాగుతున్నందువల్ల ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండకపోవచ్చు.
Updated on: Jul 30, 2025 | 11:51 AM

మేషం: ఈ రాశికి ధన, భాగ్యాధిపతుల బలం పెరుగుతున్నందువల్ల ఏలిన్నాటి శని ప్రభావం బాగా తగ్గే అవకాశం ఉంది. దీనివల్ల ఆర్థిక, కుటుంబ, ఉద్యోగ సంబంధమైన అనుకూలతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు కొనసాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు చురుకుగా, వేగంగా పూర్తయి లబ్ధి పొందుతారు. ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. నిరుద్యోగులకు, ఉద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతుంది.

వృషభం: ఈ నెలంతా రాశినాథుడు శుక్రుడికి బలం పెరగడంతో పాటు రవి బలం కూడా తోడవుతున్నందు వల్ల ఉద్యోగ జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో పదోన్నతులు కలిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో నష్టాలు తగ్గి లాభాలు పెరగడం ప్రారంభమవుతుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఆస్తి సమస్యలు అనుకూలంగా పరిష్కారం అవుతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశీ ప్రయాణాలకు అవకాశం ఉంది. సంపన్న కుటుంబంతో పెళ్లి కుదురుతుంది.

మిథునం: ఈ రాశికి ధన స్థానంలో ఉన్న రాశ్యధిపతి బుధుడికి బలం పెరగడంతో పాటు, ధన స్థానం కూడా బలంగా ఉన్నందువల్ల ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండకపోవచ్చు. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల ఊహించని ధన లాభాలు కలుగుతాయి. పిల్లలు చదువుల్లోనూ, ఉద్యోగాల్లోనూ ఘన విజయాలు సాధిస్తారు. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.

సింహం: ఈ రాశివారికి రాశ్యధిపతి రవి బలంగా ఉండడంతో పాటు లాభ స్థానంలో గురు, శుక్రుల సంచారం కొనసాగుతున్నందువల్ల విదేశీ అవకాశాలు ఎక్కువగా లభిస్తాయి. విదేశీ సంపాదన అనుభవించే యోగం పడుతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు ఎక్కువగా వెళ్లడం జరుగుతుంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు విదేశీ ఉద్యోగాల ఆఫర్లు అందుతాయి. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. ఆదాయానికి లోటుండదు.

తుల: ఈ రాశికి భాగ్య, దశమ స్థానాల్లో గ్రహాల బలం పెరగడం వల్ల ఉద్యోగంలో భారీ జీతభత్యాలతో కూడిన పదోన్నతులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు, లావాదేవీలు బాగా వృద్ధి చెందుతాయి. నిరుద్యోగులకు ఒకటి రెండు శుభవార్తలు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు తప్ప కుండా సఫలం అవుతాయి. ముఖ్యంగా అదనపు ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగులకు బాగా డిమాండ్ పెరుగుతుంది. పిత్రార్జితం లభిస్తుంది. ఆస్తి వివాదంలో విజయం సాధిస్తారు.

మకరం: ఈ రాశికి ఆరు, ఏడు స్థానాల్లో గ్రహాల బలం పెరగడం వల్ల ఉద్యోగంలో హోదా పెరగడానికి బాగా అవకాశం ఉంది. ఉద్యోగంలో ఎటువంటి సమస్యలున్నా, ఆటంకాలున్నా తొలగిపోతాయి. వృత్తి, వ్యాపారాల్లో నష్టాలు తగ్గి లాభాలు పెరుగుతాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది.



