- Telugu News Photo Gallery Spiritual photos Astrology tips for Skin Problems: How Planets Influence Your Skin Health
Astro Tips: చర్మ సంబంధిత సమస్యలను కలిగించే గ్రహాలు ఏమిటి? చేయాల్సిన పరిహారాలు ఏమిటంటే
జ్యోతిష్యం ప్రకారం జాతకంలో కొన్ని గ్రహాలు చెడు స్థితిలో ఉంటే.. ఆ గ్రహ ప్రభావం వలన చర్మ సమస్యలతో సహా అనేక సమస్యలను కలిగిస్తాయని నమ్మకం. గ్రహాల స్థానాలు చర్మ సంబంధిత సమస్యలతో సంబంధం కలిగి ఉంటాయి. జాతకంలో ఏ గ్రహాల బలహీన స్థానంలో చర్మం సమస్యలకు కారణం కావచ్చు. ఆ గ్రహాలు ఏమిటి? ఎటువంటి చర్మ సంబంధిత సమస్యలు రావచ్చునో తెలుసుకుందాం..
Updated on: Jun 24, 2025 | 6:58 PM

చర్మానికి కారకుడిగా బుధుడిని పరిగణిస్తారు. ఎవరికైనా చర్మం మీద మచ్చలు, పొట్టు రాలడం, మొటిమలు, చర్మ అలెర్జీలు లేదా ఏదైనా ఇతర చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతుంటే.. దీనికి కారణం జాతకంలో బుధుడు బలహీనంగా ఉండటం కావచ్చు.

జ్యోతిషశాస్త్రం ప్రకారం ప్రధానంగా బుధుడు ప్రభావితం చేయడం వల్ల ముఖంపై పెద్ద పెద్ద పుండ్లు వంటి మొటిమలు కనిపించడం ప్రారంభిస్తాయి. ఈ మొటిమల వలన దురద వస్తుంది. ముఖంపై ముడతలు కనిపించడం ప్రారంభిస్తాయి.

ఇటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు జాతకంలో బుధ గ్రహం స్థానాన్ని బలోపేతం చేయడానికి బుధ మంత్రాన్ని జపించండి. బుధవారం ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడానికి ప్రయత్నించండి. బుధవారం ఆవుకు పచ్చని గడ్డిని ఆహారంగా తినిపించండి.

జ్యోతిషశాస్త్రంలో, బుధుడు, రాహువు, శనీశ్వరుడు చర్మ వ్యాధులకు కారణమని భావిస్తారు. జాతకంలో రాహువు స్థానం బలహీనంగా ఉన్న వ్యక్తి చర్మానికి సంబంధించిన వ్యాధులతో బాధపడవచ్చు. రాహువు చర్మంపై మచ్చలు, దురద, వాపు వంటి సమస్యలను కలిగిస్తాడు.

మరోవైపు ఎవరి జాతకంలోనైనా శనీశ్వరుడు బలహీనమైన స్థానంలో ఉంటే.. వారి చర్మం పొడిబారి, నిర్జీవంగా మారుతుంది. శని దోషం కారణంగా ప్రజలు సోరియాసిస్, గజ్జి, తామర వంటి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.




