- Telugu News Photo Gallery Spiritual photos Astro tips: these are goddess saraswati favorite zodiac signs, to get profits
చదువుల తల్లి సరస్వతికి ఇష్టమైన రాశులు ఇవే.. అమ్మ అనుగ్రహంతో చదువులోనే కాదు ఉన్నత ఉద్యోగాలు వీరి సొంతం
హిందువులు సరస్వతి దేవిని చదువుల తల్లిగా భావిస్తారు. పురాణాల ప్రకారం సరస్వతి దేవిని జ్ఞానం, తెలివి తేటలు, విద్యకు చిహ్నంగా భావిస్తారు. అందుకనే చదువుకునే విద్యార్ధులకు సరస్వతి దేవి ఆశీస్సులు నిరంతరం ఉండాలని కోరుకుంటారు. ఎవరిపై సరస్వతి దేవి అనుగ్రహం ఉంటే.. వారికీ సకల శుభాలను కలుగుతాయని నమ్మకం. చేపట్టిన పనిలో, చదువులో ఎల్లప్పుడూ బాగా రాణిస్తారని నమ్మకం. ఈ రోజు చదువుల తల్లి సరస్వతి దేవికి ఇష్టమైన రాశులు ఏమిటో తెలుసుకుందాం..
Updated on: Aug 11, 2025 | 2:12 PM

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు, రాశులకు , నక్షత్రాలకు మాత్రమే కాదు దేవుళ్ళకు కూడా ప్రముఖ్యుత ఉంది. శివుడు, శని, కృష్ణుడు, గణపతి వంటి దేవుళ్ళు మనుషుల జీవితంపై ప్రభావాన్ని చూపిస్తారని నమ్మకం. అదే విధంగా చదువుల తల్లి సరస్వతీ దేవికి జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. అమ్మవారికి కొన్ని రాశులంటే అమితమైన ఇష్టం. వారిపై ఎల్లప్పుడూ అమ్మవారు తన ఆశీస్సులను అందిస్తుంది. విశేషమైన ప్రయోజనాలను కలిగిస్తుంది. అంతేకాదు వారు చేపట్టిన ప్రతి పనులో విజయం సాధించే విధంగా పరిస్థితులు ఏర్పడేలా చేస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సరస్వతి దేవి ఇష్టమైన అనుగ్రహం పొందే రాశులు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం.

మేష రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులపై ఎల్లప్పుడూ సరస్వతి అనుగ్రహం ఉంటుంది. అమ్మవారి దయతో అదృష్టం వీరి సొంతం. అనేక అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. ఎటువంటి పరిస్థితి ఎదురైనా సరే ధైర్యంతో వాటి నుంచి బయటపడి జీవితంలో ముందుకు సాగుతారు. తాము నిర్దేశించుకున్న లక్ష్యాలు సాధించడంలో ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీరు అద్భుతమైన జ్ఞానాన్ని, తెలివి తేటలు కలిగి ఉంటారు. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా వాటి నుంచి బయట పడేందుకు తెలివిగా ఆలోచిస్తారు.

మిథున రాశి: ఈ మిథున రాశి కూడా సరస్వతి దేవికి ఇష్టమైన రాశి. వీరిపై అమ్మవారి అనుగ్రహం సదా తోడుగా ఉంటుంది. జీవితంలో విశేషమైన ప్రయోజనాలను పొందుతారు. అంతేకాదు అమ్మవారి దయతో అదృష్టం వీరి సొంతం. ఎటువంటి పనులను అయినా సరే అద్భుతమైన రీతిలో పూర్తి చేస్తారు. జ్ఞానం వంతులు అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఎటువంటి పనులు అయినా సరే సక్సెస్ వీరి సొంతం.

కన్యా రాశి: వీరిపై కూడా సరస్వతి అనుగ్రహం ఉంటుంది. అందుకనే ఎప్పుడూ ప్రయోజనాలు పొందుతారు. ముఖ్యంగా ఈ రాశికి చెందిన వ్యక్తులు సంగీత రంగంలో ఉంటే.. వారు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. అద్భుతమైన తెలివితేటలు వీరి సొంతం. చదువుల్లో అద్భుతంగా రాణిస్తారు. ఉద్యోగంలో మంచి లాభాలు పొందగలుగుతారు. ఆరోగ్యంగా ఉంటారు.

ధనస్సు రాశి: స్వరస్వతి దేవి అనుగ్రహం ఈ రాశి వారి సొంతం. ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవాలని ఆసక్తిని కలిగి ఉంటారు. జీవితంలో అభివృద్ధి పథంగా సాగుతారు. సరస్వతి అనుగ్రహంతో చదువు అమితంగా రాణిస్తారు. ఎటువంటి క్లిష్టతర పరిస్థితులు ఎదురైనా జీవితాన్ని విజయం వైపు పయనించేలా చేస్తారు.

కుంభ రాశి: ఈ రాశికి అధినేత శని. అయితే స్వరస్వతి దేవికి కూడా ఈ రాశి వారు అంటే ఇష్టం. కనుక శని, స్వరస్వతి అనుగ్రహంతో ఎప్పుడూ వీరు కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. చదువులో రాణించి ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. ఎప్పుడూ డబ్బుకి లోటు అనే మాట లేకుండా జీవితాన్ని గడుపుతారు,




