AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాయమ్మో.. సాక్స్‌లు ధరించకుండా షూ వేస్తున్నారా..? ఈ విషయాలు తెలిస్తే గుండె గుభేలే..

ఈ రోజుల్లో చాలామంది సాక్స్ లేకుండా బూట్లు ధరిస్తున్నారు. ఇది పాదాల చెమట, దుర్వాసన, బ్యాక్టీరియా సంక్రమణలు, చర్మ అలర్జీలు వంటి సమస్యలకు దారితీస్తుంది. సాక్స్‌లు పాదాలను వెచ్చగా ఉంచుతాయి, చెమటను గ్రహిస్తాయి, చర్మాన్ని రక్షిస్తాయి. కాబట్టి, ఆరోగ్యకరమైన పాదాల కోసం ఎల్లప్పుడూ సాక్స్‌లు ధరించడం ముఖ్యం.

Shaik Madar Saheb
|

Updated on: Oct 24, 2024 | 3:30 PM

Share
పాదరక్షలను కొనుగోలు చేసేటప్పుడు, నాణ్యత, ధర తక్కువగా ఉందనీ.. షూలు కళ్లకు ఆకర్షణీయంగా కనిపిస్తే ఆలోచించకుండా కొనుగోలు చేస్తారు. కానీ నాణ్యతపై ఎక్కువ శ్రద్ధ పెట్టడం మర్చిపోకూడదు. ఫ్యాషన్‌లు సమయంతో పాటు మారుతూ ఉంటాయి. ప్రస్తుత ఫ్యాషన్ ప్రకారమే మీ పాదరక్షలను ఎంచుకోండి. అలాగే రోజువారీ దుస్తులకు అనువైన సౌకర్యవంతమైన బూట్లు ధరించడం మంచిది. మీరు బూట్లు కొనబోతున్నట్లయితే సాయంత్రం సమయాన్ని ఎంచుకోవడం మంచిది. ఎందుకంటే కొంతమందికి సాయంత్రం వేళ పాదాలు వాచి ఉంటాయి. చెప్పులు ఉదయం కొంటే, వాపు సమస్య ఉన్నవారు సాయంత్రం వేసుకోలేరు. కాబట్టి బూట్లు కొనడానికి సాయంత్రం ఉత్తమ సమయం.

1 / 5
శరీరంలో ఎక్కువగా చెమట పట్టే భాగాల్లో పాదాలు ఒకటి.. దీని కారణంగా, బూట్లు ధరించడం వలన ఎక్కువ చెమట పడుతాయి.. అయితే.. సాక్స్ లు (కాలి తొడుగులు) ఈ చెమటను ఆరబెట్టేలా పనిచేస్తాయి.. ఇలా సాక్స్‌లు పాదాలలో చెమటను నివారిస్తాయి..

2 / 5
సాక్స్‌లు ధరించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. సాక్స్‌లు అనేక రకాల బ్యాక్టీరియా నుంచి మిమ్మల్ని రక్షిస్తాయి. అలాగే గ్లౌజులు ధరించడం వల్ల ఎలాంటి ఫంగల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు రావు. వేసవిలో చెమట పట్టకుండా ఉండటమే కాకుండా చలికాలంలో కూడా సాక్స్‌లు ఎంతో మేలు చేస్తాయి. చలికాలంలో సాక్స్ లు ధరించడం వల్ల చలి నుంచి ఉపశమనం లభిస్తుంది.. ఇవి మీ పాదాలను వెచ్చగా ఉంచుతుంది.

3 / 5
కొంతమంది బూట్లు కొంటూనే ఉంటారు. అంటే తమ దగ్గర షూస్ ఉన్నాకూడా మళ్లీమళ్లీ రకరకాల రంగుల్లో కొంటూనే ఉంటారు. అయితే షూ పాదాలకు సరిపోతుందా, షూ ఎంత అవసరమో ఆలోచించరు. కాబట్టి ఖరీదైన షూలు కొనే సమయంలో ఇవన్నీ ఆలోచించి, అవసరమైతేనే కొనడానికి మనసు పెట్టాలి.

4 / 5
సాక్స్ లు ధరించకపోవడం వల్ల చాలా మంది పాదాలకు చెమట పట్టడం వల్ల ఇబ్బంది పడుతుంటారు. చెమట బూట్ల లోపల స్పష్టంగా తేమను పెంచుతుంది.. ఇది అనేక రకాల బ్యాక్టీరియా లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. తరచుగా సాక్సులు లేకుండా బూట్లు ధరిస్తే.. పాదాలపై బొబ్బలు ఏర్పడతాయి. సాక్స్ లేకుండా షూస్ వేసుకోవడం వల్ల ఈ సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువ. కావున.. బూట్లు ధరించే వారు సాక్సులను వేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

5 / 5