Health: వామ్మో.. నిద్రపోకపోతే గుండె జబ్బుల బారిన పడినట్లే.. తాజా పరిశోధనలో భయపెట్టే నిజాలు..
ఉరుకులు పరుగుల జీవితంలో చాలామంది అనేక అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ముఖ్యంగా అనేక జబ్బులకు కారణం సరిగా నిద్రలేకపోవడం, నిద్రలేమి సమస్య అని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ రోజుల్లో సరైన జీవనశైలి లేని కారణంగా చాలా మందికి నిద్రలేమి సమస్య వెంటాడుతోంది.
Updated on: Feb 21, 2023 | 7:23 PM

ఉరుకులు పరుగుల జీవితంలో చాలామంది అనేక అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ముఖ్యంగా అనేక జబ్బులకు కారణం సరిగా నిద్రలేకపోవడం, నిద్రలేమి సమస్య అని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ రోజుల్లో సరైన జీవనశైలి లేని కారణంగా చాలా మందికి నిద్రలేమి సమస్య వెంటాడుతోంది. అయితే, ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజాగా జరిపిన అధ్యయనంలో కూడా ఇదే కనుగొన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.

రాత్రి సమయంలో చాలా మందికి తగినంత నిద్ర పట్టదు. అయితే నిద్ర సరిగా రాకపోవడం, లేకపోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు వస్తాయని ఇటీవల జరిపిన అధ్యయనంలో కనుగొన్నారు. ఈ అధ్యయనంలో ఏమి కనుగొన్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

నిద్రలేమి - గుండె సమస్యలపై ఇటీవల ఒక అధ్యయనం జరిగింది. ఈ అధ్యయనం ప్రకారం సరైన నిద్ర లేకపోవడం వల్ల, గుండె సంబంధిత సమస్యలతో పాటు అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని తేలింది.

అటువంటి పరిస్థితిలో, మంచి ఆరోగ్యానికి మంచి నిద్ర చాలా ముఖ్యం. ఈ అధ్యయనంలో, చాలా మంది యువకుల నిద్ర విధానాలను విశ్లేషించారు.

సక్రమంగా నిద్రపోయే వారి కంటే.. నిద్రపోని వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం 1.4 రెట్లు ఎక్కువగా ఉంటుందని అధ్యయనం కనుగొంది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, సరైన జీవనశైలి, క్రమరహిత ఆహార విధానాలు, చెడు ఆహారపు అలవాట్లు, అనారోగ్యకరమైన ఆహారం మొదలైన వాటి కారణంగా ప్రజలు సరిగ్గా నిద్రపోలేకపోతున్నారు. అటువంటి పరిస్థితిలో, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం చాలా ముఖ్యమంటున్నారు.

ప్రస్తుత కాలంలో యువకులు సైతం గుండె జబ్బుల బారిన పడుతున్నారు. కావు. మంచి జీవనశైలితో నిద్రలేమి, పలు అనారోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చు.




