Beer Side Effects: వేసవి వేడి తట్టుకోలేక రోజూ బీర్ తాగుతున్నారా.. అయితే ప్రమాదంలో పడినట్లే..
ప్రపంచవ్యాప్తంగా బీర్ ప్రియులకు కొరత లేదు. ప్రపంచంలో టీ, కాఫీ తర్వాత బీర్ మూడవ అత్యంత ప్రజాదరణ పొందిన పానీయం. చాలా రోజుల పని తర్వాత లేదా వారాంతాల్లో అలసట నుంచి ఉపశమనం పొందేందుకు బీర్ మంచి ఫ్రెండ్ అని చాలా మంది అనుకుంటారు.మన మధ్యలో రోజూ ఒక గ్లాసు బీరు తాగే వారు కూడా ఉన్నారు. బీరులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. బీర్ చర్మం, జుట్టు సంరక్షణలో కూడా ఉపయోగించబడుతుంది. కానీ ప్రతిరోజూ బీర్ తాగడం శరీరానికి మంచిది కాదు.