- Telugu News Photo Gallery Should follow these vastu tips before planting banana plant otherwise it will lead to economical problems
Vastu Tips: అరటి మొక్క పక్కన ఈ చెట్లను అస్సలు పెంచకూడదు.. అలా చేస్తే అర్థిక ఇబ్బందులు తప్పవు..!
Updated on: Jan 20, 2023 | 1:35 PM

వాస్తు శాస్త్ర ప్రకారం కొన్ని కొన్ని పనులను చేయకూడదు. అలాగే కొన్ని రకాల వాస్తు చిట్కాలను తెలుసుకొని వాటిని పాటించడం ద్వారా జీవితం, కుటుంబంలోని సమస్యల నుంచి బయటపడవచ్చు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ఆవరణలో అరటి మొక్కను ఎక్కడ, ఏ దిశలో నాటాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

భారతీయ సంప్రదాయంలో అరటి మొక్కకు గొప్ప స్థానం ఉంది. శ్రీమహా విష్ణువుకు ప్రతిరూపంగా పూజించే అరటిని చాలా మంది తమ ఇంటి పెరటిలో పెంచుతుంటారు.

అయితే ఈ అరటి మొక్కను నాటేటప్పుడు మనం చేసే కొన్ని పొరపాట్లు వాస్తు దోషానికి కారణమవుతున్నాయి. ఈ అరటి మొక్క పక్కనే కొన్ని మొక్కలు పెంచితే సమస్య ఇంకా పెరుగుతుందని వాస్తు నిపుణులు అంటున్నారు.

వాస్తు శాస్త్రం ప్రకారం అరటి మొక్కను ఇంటి ముందు ఎప్పుడూ నాటకూడదు. అందుకు బదులుగా ఇంటి వెనుక నాటాలి. అలాగే అరటి మొక్క చుట్టూ చాలా శుభ్రత పాటించాలి. లేదంటే వాస్తు దోషం ఉంటుంది.

అరటి మొక్క పక్కన మీరు ఏ మొక్కను పెంచుతున్నారో కూడా ప్రధాన్యమైన విషయమే. అరటి మొక్క దగ్గర తులసి మొక్కను నాటడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోవడమే కాకుండా సంపద కూడా పెరుగుతుంది.

అరటి మొక్క విష్ణుమూర్తికి ప్రాతినిధ్యం వహిస్తున్నందున దీనికి గురువారం పసుపును సమర్పించడం శుభప్రదమని సనాతన ధర్మంలో ఉన్న నమ్మకం. అలాగే ఈ రోజు మొక్కకు నెయ్యి దీపం వెలిగించి పూజిస్తే ఇంట్లో శాంతి నెలకొంటుంది.

అరటి మొక్క పక్కన అడవి గులాబీ మొక్కను నాటడం లేదా ఏదైనా ముళ్ల మొక్కను పెంచడం ఇబ్బందులను ఆహ్వానిస్తోంది. అలాగే ఆర్థిక నష్టాన్ని కూడా కలిగిస్తుంది.





























