Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sea Food: పీతలు, రొయ్యలు, చేపలు వండేటప్పుడు మీరూ ఈ తప్పులు చేస్తున్నారా?

కొందరు పీతలు, రొయ్యలు, చేపలు సముద్ర ఆహారాలను అమితంగా ఇష్టపడతారు. వీటితోపాటు ఆక్టోపస్, స్క్విడ్, ఎండ్రకాయలు వంటి వివిధ సీఫుడ్ ఆహారాలు కూడా వివిధ రెస్టారెంట్లలో చాలా ఫమస్‌. అయితే సీఫుడ్ తినడం ఎంత మంచిదో, ప్రమాదాలు కూడా అంతే ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. వీటిని వండే ముందు సరిగ్గా శుభ్రం చేయకపోతే కడుక్కోకపోతే ఫుడ్ అలర్జీలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ పెను ప్రమాదాన్ని నివారించాలంటే..

Srilakshmi C

|

Updated on: Aug 18, 2024 | 1:28 PM

కొందరు పీతలు, రొయ్యలు, చేపలు సముద్ర ఆహారాలను అమితంగా ఇష్టపడతారు. వీటితోపాటు ఆక్టోపస్, స్క్విడ్, ఎండ్రకాయలు వంటి వివిధ సీఫుడ్ ఆహారాలు కూడా వివిధ రెస్టారెంట్లలో చాలా ఫమస్‌. అయితే సీఫుడ్ తినడం ఎంత మంచిదో, ప్రమాదాలు కూడా అంతే ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. వీటిని వండే ముందు సరిగ్గా శుభ్రం చేయకపోతే కడుక్కోకపోతే ఫుడ్ అలర్జీలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ పెను ప్రమాదాన్ని నివారించాలంటే ఈ కింది జాగ్రత్తలు తీసుకోండి.

1 / 5
రొయ్యలు లేదా పీతలను మార్కెట్ నుంచి కొనుగోలు చేసిన తర్వాత ఎక్కువసేపు నిల్వ చేయకూడదు. వీలైనంత త్వరగా శుభ్రం చేసి ఫ్రిజ్‌లో ఉంచడం బెటర్‌. అందులో ముఖ్యంగా చేపలు వెంటనే శుభ్రం చేయాలి. లేకపోతే త్వరగా పాడైపోతాయి.

2 / 5
మార్కెట్ నుంచి కొనుగోలు చేసే ముందు అవి సరిగ్గా నిల్వ చేయబడిందో లేదో తనిఖీ చేయాలి. ఒకవేళ ప్యాక్ చేసిన ఆహారాన్ని కొనుగోలు చేస్తే, దాని గడువు తేదీని తనిఖీ చేయాలి. అలాగే వాసనపై కూడా శ్రద్ధ పెట్టాలి. ఇది అమ్మోనియా వంటి వాసన ఉంటే, చేప తాజాది కాదని అర్థం చేసుకోవాలి. చేపల రంగును కూడా చూడాలి. ముదురు రంగు, దుర్వాసన ఎక్కువగా కనిపిస్తే ఆ చేపను కొనకపోవడమే మంచిది.

3 / 5
రొయ్యలు, పీతలు అయితే బాగా శుభ్రం చేయాలి. సముద్ర చేపలలో సీసం, కాడ్మియం వంటి భారీ లోహాలు ఉంటాయి. కాబట్టి బాగా కడగకపోతే, అవి శరీరంలోకి ప్రవేశించి గుండెపై ప్రభావం చూపుతాయి. సీఫుడ్ ను రిఫ్రిజిరేటర్ లో ఉంచినా.. ఎక్కువ సమయం ఉంచడం మంచిది కాదు. ఎందుకంటే సీఫుడ్‌ని ఎక్కువసేపు ఫ్రిజ్‌లో ఉంచినా బ్యాక్టీరియా సోకుతుంది. ఇది కడుపు నొప్పి, అతిసారం, వాంతులు, ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమవుతుంది. కాబట్టి ఫ్రిజ్‌లో ఉంచిన 3-4 రోజులలోపు తినడం మంచిది.

4 / 5
సముద్రపు ఆహారంలో శరీరానికి హాని కలిగించే వివిధ పరాన్నజీవులు ఉంటాయి. కాబట్టి బాగా శుభ్రం చేసి ఎక్కువ వేడి మీద ఉడికించాలి. ఇలా చేస్తే అన్ని క్రిములు నశిస్తాయి. పచ్చిగా లేదా తేలికగా ఉడికించి తింటే అది ప్రమాదకరం. సాల్మొనెల్లా బ్యాక్టీరియా సముద్ర ఆహారంలో అధికంగా పెరుగుతుంది. కాబట్టి వండిన ఆహారంతో పచ్చి సముద్రపు ఆహారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ చేర్చకూడదు.

5 / 5
Follow us