- Telugu News Photo Gallery Science photos Where Dinosaurs also affected by cold 150 million years ago, scientists give shocking explanation
Dinosaurs: 150 మిలియన్ సంవత్సరాల క్రితం డైనోసార్‌లు కూడా జలుబుతో బాధపడేవి.. శాస్త్రవేత్తలు చెప్పిన షాకింగ్ కారణం ఇదే..
150 మిలియన్ సంవత్సరాల క్రితం డైనోసార్‌లను(Dinosaur) సాధారణ జలుబు(cold), దగ్గు ఇబ్బంది పెట్టేదట. డైనోసార్‌లు శ్వాసకోశ వ్యాధులు, ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌లతో కూడా పోరాడాయి. అయితే భయంకరమైన కారణం వెలుగులోకి వచ్చింది.
Updated on: Feb 17, 2022 | 12:57 PM

ఇప్పుడు మనుషులను ఇబ్బందిపెడుతున్న జలుబు.. 150 మిలియన్ సంవత్సరాల క్రితం డైనోసార్లను కూడా అనారోగ్యానికి గురి చేసినట్లుగా తెలుస్తోంది. డైనోసార్‌లు శ్వాసకోశ వ్యాధులు, ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌లతో కూడా పోరాడాయని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించిన ఆధారాలను కూడా శాస్త్రవేత్తలు గుర్తించారు. చలితో వచ్చే సమస్యలతో డైనోసార్లు పోరాడినట్లుగా డాక్టర్ కె.ఎస్. క్యారీ వుడ్రఫ్ తన పరిశోధనలో వెల్లడించారు.

"నేచర్" నివేదికలో జురాసిక్ కాలం నాటి పెద్ద డైనోసార్ల మెడ ఎముకలు పరిశీలించిన డాక్టర్ కె.ఎస్. క్యారీ ఈ వివరాలను వెల్లడించారు.30 ఏళ్ల క్రితం కనిపెట్టిన డైనోసార్ ఎముకల మెడను పరిశీలించగా అందులో చిన్న క్యాబేజీ ఆకారం ఉందన్నారు. ఈ ఆకారం ఎందుకు వచ్చిందనే దానిపై పరిశోధనలు జరుగుతున్నాయని పరిశోధకులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

చాలా మంది శాస్త్రవేత్తలు సోషల్ మీడియా పోస్ట్‌లలో దీనికి కారణాలను తెలిపారు. ఇది జలుబు లేదా శ్వాసకోశ ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు ఉన్నప్పుడు ఇలా ఏర్పడుతుందని వెల్లడించారు డా. క్యారీ వుడ్రఫ్. ఆయన తన పరిశోదనల్లో కీలక వివరాలను తెలిపారు. అవి కూడా జబ్బుపడిన వ్యక్తిల్లా దగ్గుతూ ఉండాలని అన్నారు. వాటికి కూడా జ్వరం వచ్చి ఉండవచ్చని అభిప్రాయ పడ్డడారు.

వాటికి జలుబు రావడానికి ఆస్పెర్‌గిలోసిస్ అనే ఫంగస్ కారణం అని కెర్రీ తెలిపారు. పక్షులకు ఈ ఆస్పెర్‌గిలోసిస్ సోకినట్లయితే.. అది ప్రాణాంతకంగా మారుతుందన్నారు. కొన్ని డైనోసార్ జాతుల మృతికి ఈ ఫంగస్ కూడా కారణం కావచ్చన్నారు.

డాలీ డైనోసార్ శాఖాహారి అని వుడ్రఫ్ తెలిపారు. డైనోసార్ల గురించి అనేక విషయాలను వెల్లడించారు. వాటి శ్వాసకోశ వ్యవస్థ పక్షుల మాదిరిగానే ఉన్నందున.. వాటికి వివిధ రకాల వ్యాధులు వచ్చి ఉండవచ్చన్నారు.




