- Telugu News Photo Gallery Science photos Plans for the first sustainable city on mars have officially been revealed
City On Mars: మార్స్‌పై సరికొత్త ప్రయోగం.. అంత డబ్బు మీవద్ద ఉందా?.. మార్స్‌పైకి మీరూ వెళ్లొచ్చు…
ఈ నగర నిర్మాణం 2054 లోనే ప్రారంభమై.. 2100 నాటికి పూర్తవుతుంది. ఆ సమయం నాటికి అంగారక గ్రహంపై మొదటి బ్యాచ్ వెళుతుంది అని ఆర్కిటెక్చర్ స్టూడియో ABIBOO వ్యవస్థాపకుడు అల్ఫ్రెడో మునోజ్ తెలిపారు.
Updated on: Mar 23, 2021 | 7:00 AM

మార్స్‌పై స్థిరమైన నగరానికి సంబంధించిన ప్రణాళికలు అధికారికంగా ప్రకటించారు. ఆర్కిటెక్ట్ సంస్థ ABIBOO.. మార్స్‌పై రాజధాని నగరం ‘నువా’తో పాటు.. మరో నాలుగు నగరాల నిర్మాణం కోసం ఒక డిజైన్‌ను ఆవిష్కరించింది.

నువా పని చేసే నగరంగా ఉంటుంది. ఇక్కడ కార్యాలయాలు, గృహాలు, పచ్చని ప్రదేశాలను కలిగి ఉంటుంది.

మార్స్‌పై ఉండే వాతావరణం నుండి అక్కడ నివసించే వారిని కాపాడేందుకు రాజధాని నువా ను ఒక కొండ ప్రాంతంవైపు నిర్మిస్తున్నారు.

మార్స్‌పై ఆక్సిజన్‌ను మొక్కల ద్వారా ఉత్పత్తి చేస్తారు. ఆహారం 90 శాతం మొక్కల ఆధారితమైనది ఉత్పత్తి చేశారు. అలాగే విద్యుత్‌ను సౌర ఫలకాల ద్వారా ఉత్పత్తి చేస్తారు. CO2, నీరు మార్స్ ఉపరితలంపై సులభంగా లభిస్తాయి.

ABIBOO.. ది మార్స్ సొసైటీ మరియు సోనెట్ నెట్‌వర్క్‌తో కలిసి సుస్థిరత-కేంద్రీకృత మార్స్ సిటీ ప్రాజెక్ట్ కోసం పూర్తిగా శాస్త్రీయంగా పరిశోధించి డిజైన్‌ను అభివృద్ధి చేసింది.

ఈ నగర నిర్మాణం 2054 లోనే ప్రారంభమై.. 2100 నాటికి పూర్తవుతుంది. ఆ సమయం నాటికి అంగారక గ్రహంపై మొదటి బ్యాచ్ వెళుతుంది అని ఆర్కిటెక్చర్ స్టూడియో ABIBOO వ్యవస్థాపకుడు అల్ఫ్రెడో మునోజ్ తెలిపారు.





























