- Telugu News Photo Gallery Science photos Indian astronomers spot over 200 new stars in the pacman nebula
ARIES Astronomers: భారతీయ ఖగోళ శాస్త్రవేత్తల ఘనత.. 200లకు పైగా కొత్త నక్షత్రాల గుర్తింపు..
ARIES Astronomers: భారతీయ ఖగోళ శాస్త్రవేత్తల ఘనత.. 200లకు పైగా కొత్త నక్షత్రాల గుర్తింపు..
Updated on: Apr 14, 2021 | 2:38 PM

భారతీయ ఖగోళ శాస్త్రవేత్తలు ప్యాక్మన్ నిహారికలో 200 లకు పైగా కొత్త నక్షత్రాలను గుర్తించారు. వీటిలో 51 నక్షాలు ఇంకా వృద్ధి దశలోనే ఉన్నాయి.

ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్స్ (ARIES)కు చెందిన ఖగోళ శాస్త్రవేత్తలు ప్యాక్మన్ నిహారిక(ప్యాక్మన్ పాలపుంత)లో 228 కొత్త నక్షత్రాలను కనుగొన్నారు.

దుమ్ము, దూళితో నిండి ఉన్న ఈ పాలపుంత విశ్వంలో 1,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఈ పాలపుంతలో నక్షత్రాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

కొత్తగా కనిపెట్టిన నక్షత్రాలలో 51 నక్షాలు ఇంకా యవ్వన దశలోనే ఉన్నాయి. ఈ నక్షత్రాలు హైడ్రోజన్‌తో సంలీనం చెందే ముందు.. ధూళి, వాయువులను సేకరిస్తున్నాయని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఈ ప్యాక్మన్ నిహారికను ఎన్‌జిసి 281గా పిలుస్తారు. ఇది భూమి నుంచి 9,500 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. అయితే, ఖగోళ కోణంలో మాత్రం ఇది చాలా దగ్గరగా ఉందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.

ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్స్ (ARIES) కు చెందిన స్నేహ లత నేతృత్వంలోని ఖగోళ శాస్త్రవేత్తల బృందం.. ఆసియాలోనే అతిపెద్ద టెలిస్కోప్ 3.6 మీటర్ల దేవస్థల్ ఆప్టికల్ టెలిస్కోప్ (DOT)ను ఉపయోగించి ఈ కాస్మిక్ క్లౌడ్ గ్యాస్‌పై పరిశోధనలు చేపట్టారు. ఇది ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ సమీపంలో ఏర్పాటు చేశారు. తాజాగా కనుగొనబడిన ఈ నక్షాత్రాల్లో చాలా రకాలు ఉన్నాయని అన్నారు.




