- Telugu News Photo Gallery School Holidays: Milad un Nabi, Ganesh festivities offer long weekend for many in Hyderabad
School Holidays: విద్యార్థులకు శుభవార్త.. తెలంగాణలో వరుసగా 3 రోజులు పాఠశాలలకు సెలవులు!
Telangana School Holidays: గతనెల ఆగస్ట్‌లో కూడా విద్యాసంస్థలకు భారీగా సెలవులు వచ్చాయి. ఇప్పుడు సెప్టెంబర్ నెల. ఇప్పుడు కూడా విద్యార్థులకు భారీగా సెలవులు వస్తున్నాయి. ఈ మూడు రోజులు. ఆ తర్వాత దసరా సెలవులు ఉండనున్నాయి. అలాగే ఇప్పుడు వరుసగా..
Updated on: Sep 04, 2025 | 7:12 AM

School Holidays: విద్యార్థులకు భారీ శుభవార్త. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే సెప్టెంబర్ 5, 6, 7 తేదీల్లో వరుసగా సెలవులు ఉండనున్నాయి. 6వ తేదీ (శనివారం) గణేష్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు సాధారణ సెలవు ప్రకటించింది ప్రభుత్వం. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు జారీ చేసిన జి.ఓ (1205)లో స్పష్టం చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో పలు విద్యాసంస్థలకు 3 రోజులు సెలవులు రానున్నాయి. ఎందుకంటే ఈ నెల 5వ తేదీన మిలాద్-ఉన్-నబీ ఉంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రభుత్వ సెలవులు ఉంటుంది. ఆ తర్వాత రోజు శనివారం గణేశ్ నిమర్జనం వచ్చేస్తుంది.

హైదరాబాద్‌తోపాటు చుట్టుపక్కల జిల్లాల్లో ఉన్న స్కూల్స్, కళాశాలలకు ప్రభుత్వం సెలవులు ఉండనుంది. అలాగే ఆదివారం సాధారణంగా పాఠశాలలకు సెలవు ఉండేది. ఇలా చూసుకుంటే విద్యార్థులకు వరుసగా మూడు రోజుల పాటు సెలవు ఉండనుంది.

అయితే ప్రభుత్వం 6వ తేదీన ప్రకటించిన సెలవును అక్టోబర్ 11వ తేదీన వచ్చే రెండో శనివారం వర్కింగ్ డేస్‌గా ప్రకటించింది. అయితే సాధారణంగా రెండో శనివారం సెలవు ఉన్నప్పటికీ, ఆ రోజు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు యధావిధిగా పని చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఇదిలా ఉండగా, గతనెల ఆగస్ట్‌లో కూడా విద్యాసంస్థలకు భారీగా సెలవులు వచ్చాయి. ఇప్పుడు సెప్టెంబర్ నెల. ఇప్పుడు కూడా విద్యార్థులకు భారీగా సెలవులు వస్తున్నాయి. ఈ మూడు రోజులు. ఆ తర్వాత దసరా సెలవులు ఉండనున్నాయి. దసరా పండగకి ఏకంగా 13 రోజుల పాటు విద్యార్థులకు సెలవులు వస్తున్నాయి. ఒక విధంగా చూస్తే విద్యార్థులకు పండగే. ఎక్కడికైనా కుటుంబంతో కలిసి టూర్ వెళ్లాలని ప్లాన్ చేసుకుంటే ఇది మంచి ఆప్షన్ అనే చెప్పాలి.
