AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

ఆకుకూరలు ఆరోగ్యానికి మంచివనే విషయం దాదాపు అందరికీ తెలిసిందే. ఆకు కూరలలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి. అందుకే నిత్యం ఏదో ఒక ఆకుకూరను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. అయితే, వర్షాకాలంలో ఆకు కూరలు తినటం మంచిదేనా..? అలా తింటే ఏమౌతుందో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda
|

Updated on: Aug 04, 2025 | 10:13 PM

Share
వర్షాకాలంలో ఆకుకూరలు తినకూడదని ఇంట్లో పెద్దలు తరచూ చెబుతుంటారు. వర్షాకాలంలో ఆకు కూరలు తింటే కడుపు నొప్పి, విరేచనాలు అవుతాయని చెబుతుంటారు. అయితే, ఇవన్నీ  అపోహలు మాత్రమే అని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వర్షాకాలంలో ఆకు కూరలు తినకూడదని ఎందుకంటారంటే,..

1 / 5
కూరగాయలతో పోలిస్తే ఆకుకూరలు భూమికి దగ్గరగా పెరుగుతాయి. వర్షపు జల్లుల వల్ల బ్యాక్టీరియా, ఫంగస్ సులభంగా వృద్ధి చెందుతాయి. అంతేకాకుండా ఆకుకూరలపై మట్టి, కీటకాలు లేదా వాటి గుడ్లు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నింటిని కారణాలుగా పేర్కొంటూ ఆకుకూరలు తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతుంటారు.

2 / 5
వర్షాకాలంలో మన శరీరానికి అవసరమయ్యే కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, పోలిక్ ఆమ్లాలు ఆకుకూరల నుంచి ఎక్కువ మొత్తంలో లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే, రోజువారీ ఆహారంలో 50 గ్రాముల చొప్పున ఏదో ఒక ఆకుకూరని చేర్చుకోవాలని సూచిస్తున్నారు.

3 / 5
ఆకు కూరలు వండేముందు ఉప్పు లేదా వెనిగర్ కలిపిన నీటితో రెండు లేదా మూడు సార్లు బాగా కడిగి ఎక్కువసేపు ఉడికించాలని నిపుణులు చెబుతున్నారు.  ఈ కాలంలో పచ్చి ఆకుకూరలు తినడం కంటే, వాటిని బాగా ఉడికించి తినడం మంచిదని, ఇలా చేయడం వల్ల అందులో ఉండే సూక్ష్మజీవులు నశిస్తాయని చెబుతున్నారు.

4 / 5
ఆకులు కొనే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మురికిగా లేదా వాడిపోయిన వాటిని కొనుగోలు చేయకుండా, తాజాగా కనిపించే ఆకుకూరలనే ఎంచుకోవాలని సలహా ఇస్తున్నారు. వీలైతే సేంద్రీయ పద్ధతిలో పండించిన ఆకుకూరలను ఎంచుకోవడం మంచిదని, ఎందుకంటే వాటిపై రసాయన అవశేషాలు తక్కువగా ఉంటాయని పేర్కొన్నారు.

5 / 5
Follow Us
ఏపీలో మరో గోల్డ్ మైన్స్.. త్వరలో టెండర్ ప్రక్రియ!

అమ్మోరు సినిమాలో నిజమైన పాముతో షూటింగ్.. తర్వాత జరిగిందిదే..

ఏపీ ఈఏపీ-సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. వెబ్ ఆప్షన్లు ఎప్పటి

ఓటీటీలోకి మలయాళం సూపర్ హిట్ .. తెలుగులోనూ చూడొచ్చు

రోజుకు 3GB డేటాతో బీఎస్‌ఎన్‌ఎల్‌ చౌకైన ప్లాన్‌..వ్యాలిడిటీ ఎంతంటే

ఏందక్కాయ్ నువ్వు..ఏకంగా కండక్టర్ బ్యాగుకే ఎసరు పెట్టావ్..

పిల్లలు ఎంతో ఇష్టంగా తినే పాతకాలపు సాంప్రదాయ టిఫిన్ "రైలు పలహారం"
పిల్లలు ఎంతో ఇష్టంగా తినే పాతకాలపు సాంప్రదాయ టిఫిన్
దేశ అణు రక్షణపై సైబర్ అటాక్! కీలక పత్రాలు లీక్!

ఒక్క నిర్ణయంతో ఆ దేశంలో పొగరాయుళ్ల ఆటకట్టించిన సర్కార్..

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అక్షర్ పటేల్ సరికొత్త రికార్డు