- Telugu News Photo Gallery Political photos Telangana CM KCR announces Rs 10,000 and 20kg rice as relief to each flood affected household Telugu News
Telangana: వారికి తక్షణమే రూ.10 వేల ఆర్థిక సాయం, 20 కిలోల చొప్పున బియ్యం.. CM KCR ప్రకటన
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ పర్యటించారు మొదట భద్రాచలంలో పర్యటించిన సీఎం.. అక్కడి నుంచి హెలికాప్టర్లో ఏటూరునాగారంలోని రామన్నగూడెంకు చేరుకున్నారు. వరద బాధితులను పరామర్శించారు.
Updated on: Jul 17, 2022 | 6:12 PM

వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా భద్రాచలంలో వంతెన పైనుంచి గోదావరి ఉద్ధృతిని సీఎం కేసీఆర్ పరిశీలించారు. అనంతరం ఐటీడీఏలో ఎమ్మెల్యేలు, అధికారులతో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

వరద బాధితులకు పునరావాస కేంద్రాలను కొనసాగించాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు తక్షణమే రూ.10 వేల ఆర్థిక సాయం, 20 కిలోల చొప్పున బియ్యం అందించనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు.

సింగరేణి, ప్రభుత్వం కలిపి రూ.వెయ్యికోట్లు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామని కేసీఆర్ అన్నారు. గోదావరికి 90 అడుగుల వరద వచ్చినా ఇబ్బంది లేకుండా చర్యలు చేపడతామని చెప్పారు.

భారీ వర్షాల దృష్ట్యా నెలాఖరు వరకు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని.. తెలంగాణ సీఎం కేసీఆర్ సూచించారు.

వరద ప్రవాహం తగ్గాలని గోదావరికి సీఎం కేసీఆర్ సారె సమర్పించి.. శాంతి పూజలు నిర్వహించారు. మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఉన్నతాధికారులతో కలిసి గోదావరి వరద తాకిడికి గురైన కరకట్టను సీఎం కేసీఆర్ పరిశీలించారు.
