- Telugu News Photo Gallery Political photos Janasena Pawan Kalyan Sensational Comments On YCP Party Andhrapradesh
Pawan Kalyan: వచ్చేది జనసేన ప్రభుత్వమే.. వైసీపీ 15 సీట్లేకే పరిమితం.. మీరో మేమో తేల్చుకుందాం రండి: పవన్ కల్యాణ్
Pawan Kalyan: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం ఖాయమని, వచ్చేది జనసేన ప్రభుత్వమే అని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. వైసీపీ ఇప్పుడు ..
Updated on: Sep 30, 2021 | 5:41 AM

Pawan Kalyan: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం ఖాయమని, వచ్చేది జనసేన ప్రభుత్వమే అని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. వైసీపీ ఇప్పుడు 151 సీట్లతో ఉందని, తదుపరి 15 సీట్లకే పరిమితమవుతుంది వ్యాఖ్యానించారు. ఏపీ నుంచి వైసీపీని తరిమేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. వైసీపీ నాయకత్వానికి ఛాలెంజ్ చేస్తున్నా.. మీరో మేమో తేల్చుకుందాం రండి అని పవన్ కల్యాణ్ సవాల్ విసిరారు. బుధవారం మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పవన్ కల్యాణ్ ప్రసింగించారు.

ఈ సన్నాసులకి.. వారికి జన్మనిచ్చిన తల్లిదండ్రులు నేర్పని సంస్కారాన్ని నేను నేర్పగలనా? కానీ సరిగా నూనూగు మీసాలు రాని కుర్రాళ్లు మాత్రం మీకు సంస్కారం నేర్పిస్తారు. ఈ వైసీపీ వ్యక్తులకి డబ్బు అధికారం అహంకారం పుష్కలంగా ఉన్నాయి. వారికి లేనిదల్లా భయం ఒక్కటే. ఆ భయం అంటే ఎలా ఉంటుందో నేను మీకు నేర్పిస్తాను అంటూ ఎద్దెవా చేశారు.

పార్టీ పెట్టిన నాటి నుంచి నేను చాలా బాధ్యతగా ఉంటున్నా.. చాలా బాధ్యతగా మాట్లాడుతున్నా.. మాట తూలను.. నాకు బూతులు రాక కాదు. మాట్లాడలేకా కాదు.. మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడను. వైసీపీ వాళ్లకు మాత్రమే బూతులు వచ్చా.. మీరు ఒక్క భాషలో తిడితే మేము నాలుగు భాషల్లో తిడతాం.. ఒక్క రోజు సమయం ఇస్తే మీరు కోరుకున్న భాష నేర్చుకుని మరీ తిడతా.. అంటూ వ్యాఖ్యానించారు.


ఒట్టి గొడ్డుకు అరువులెక్కువ వానలేని మబ్బుకు ఉరుములెక్కువ అన్నట్లు వైసీపీ నాయకులు అరుస్తున్నారు. ఏ రోజైనా ప్రజా సమస్యలపై దృష్టిపెట్టారా? మేము అడిగి నెల రోజులు అవుతుంది, ఈ రోజుకి పాడైనా ఒక్క రోడ్డైనా మరమ్మతు చేశారా? అంటూ ప్రశ్నించారు. వైసీపీ వాళ్లు అవినీతి లేకుండా పాలన చేస్తామంటే నమ్ముతామా? ఏటా రాష్ట్రానికి వచ్చే ఆదాయం లక్ష కోట్ల పైమాటే. ఈ లక్ష కోట్లు ఏం చేస్తున్నారు. జీతాలు సరైన సమయానికి ఇవ్వరు. పెన్షన్లు సమయానికి ఇవ్వరు అంటూ పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు.





























