- Telugu News Photo Gallery Political photos Gujarat civic polls 2021 live news for voting on district panchayat 81 nagar palika and 214 taluka panchayats
గుజరాత్ పంచాయతీ ఎన్నికలు 2021 : స్థానికల సంస్థల్లో ప్రశాంతంగా పోలింగ్.. భారీగా తరలివచ్చిన ఓటర్లు
Gujarat civic polls 2021 : గుజరాత్ రాష్ట్రంలోని 31 జిల్లాల్లో 980 సీట్లు, 231 తాలూకా పంచాయతీలలో 4774 సీట్లు, 81 మునిసిపాలిటీల్లో 2720 సీట్లతో సహా మొత్తం 8,474 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
Updated on: Mar 01, 2021 | 2:42 PM

గుజరాత్ పంచాయతీ, మున్నిపల్ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. 31 జిల్లా పంచాయతీలు, 214 తాలూకా పంచాయతీలు మరియు 81 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి.

గ్రామీణ ప్రాంతాల్లో ఓటేసేందుకు బారులు తీరిన మహిళలు

గుజరాత్ రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్‌లో వృద్ధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన ఓ వృద్దురాలికి పోలీసులు సాయంగా నిలిచారు.

పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరిన ఓటర్లు

పోలింగ్ ప్రారంభమైన ఉదయం ఏడు గంటల నుంచే ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో పోలింగ్‌లో పాల్గొన్నారు.

ఉదయం ఏడు ముప్పై గంటల నుండి ప్రజలు ఓటింగ్ కోసం క్యూలలో నిలబడ్డారు. కరోనా మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకుని ఓటింగ్ నిర్వహిస్తున్నారు.

మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓటు వేయడానికి ఎదురు చూస్నున్న మహిళలు..

ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. కడి వార్డ్ నెంబర్ 4 లోని జాన్ సువిద కేంద్రంలో నితిన్ పటేల్ ఓటు వేశారు. నితిన్ పటేల్ తన భార్య సులోచనబెన్ పటేల్, కుమారుడు సన్నీ పటేల్‌తో కలిసి ఓటు వేశారు.

31 జిల్లాల్లో 980 సీట్లు, 231 తాలూకా పంచాయతీలలో 4774 సీట్లు, 81 మునిసిపాలిటీల్లో 2720 సీట్లతో సహా మొత్తం 8,474 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు.




