- Telugu News Photo Gallery Political photos CM KCR conducted dussehra celebrations at pragati bhavan Photos
CM KCR Dussehra Celebrations Photos: ఘనంగా దసరా వేడుకలు జరుపుకున్న ‘సీఎం కేసీఆర్’ ఫ్యామిలీ ఫొటోస్…
విజయ దశమి సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు ప్రగతి భవన్లోని నల్ల పోచమ్మ అమ్మవారి దేవాలయంలో కుటుంబ సమేతంగా అమ్మవారికి పూజలు నిర్వహించారు. సంప్రదాయ బద్ధంగా వాహన పూజ, అయుధ పూజ ఘనంగా నిర్వహించారు...
Updated on: Oct 15, 2021 | 10:42 PM

విజయ దశమి సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు ప్రగతి భవన్లోని నల్ల పోచమ్మ అమ్మవారి దేవాలయంలో కుటుంబ సమేతంగా అమ్మవారికి పూజలు నిర్వహించారు.

అర్చకుల నుంచి ఆశీర్వదం తీసుకున్నారు. సంప్రదాయ బద్ధంగా వాహన పూజ, అయుధ పూజ ఘనంగా నిర్వహించారు. దసరా సందర్భంగా జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజ నిర్వహించారు.

అయితే సీఎం స్వయంగా వాహన పూజ చేశారు. కేసీఆర్ తన వాహనానికి మంగళ హారతి ఇచ్చి.. కొబ్బరికాయ కొట్టారు. అనంతరం గుమ్మడికాయ కొట్టారు.

కుటుంబ సభ్యులు, సిబ్బందిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ సతీమణి శోభ, మున్సిపల్ శాఖ మంత్రి కె. తారక రామారావు, శైలిమ దంపతులు, సీఎం మనుమడు హిమాన్షు, మనుమరాలు అలేఖ్య, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్ కుమార్ రెడ్డి, సీఎం కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

తర్వాత ఆయుధ పూజ నిర్వహించారు. మొదటగా అమ్మవారి చిత్రపటానికి మంగళహారతి ఇచ్చారు కొబ్బరికాయ కొట్టారు.